చిత్తూరు అర్బన్: జిల్లా పోలీసు సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో చిత్తూరు నగరంలో ఏర్పాటు చేయనున్న ఐవోసీఎల్ పెట్రోలు బంకుకు సంబంధించి శుక్రవారం అధికారులు భూమి పూజచేశారు. చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిలోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రాన్ని ఆనుకుని ఉన్న స్థలంలో ఏర్పాటు చేయనున్న పెట్రోలు బంకుకు చిత్తూరు నాన్–కేడర్ ఎస్పీ రాజశేఖర్‌రాజు భూమి పూజచేశారు. త్వరలోనే పనులు ప్రారంభించి, ఇంధన విక్రయాలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ మహబూబ్ బాష, డీటీసీ ఇన్‌స్పెక్టర్ అమర్‌నాథ్ రెడ్డి, ఆర్‌ఐ వీరేష్ తదితరులు పాల్గొన్నారు.


