పుష్పయాగానికి అంకురార్పణ | - | Sakshi
Sakshi News home page

పుష్పయాగానికి అంకురార్పణ

Jul 30 2026 4:48 AM | Updated on Jul 30 2026 4:48 AM

పుత్తూరు: అప్పలాయిగుంటలోని శ్రీప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం రాత్రి పుష్పయాగ అంకురార్పణను శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు సేనాధిపతి ఉత్సవం జరిపించారు. పుట్టమట్టిని ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయానికి ఊరేగింపుగా తీసుకువచ్చారు. ప్రధాన అర్చకులు సూర్యకుమారాచార్యులు పుట్టమట్టిని మేదినీదేవి రూపంలో అలంకరించారు. రాత్రి 8 గంటలకు ఆలయ మహాగోపురం వద్ద వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అంకురార్పణ చేపట్టారు. అనంతరం ఏకాంతసేవ నిర్వహించారు. సూపరింటెండెంట్‌ శ్రీవాణి, ఆలయ అధికారి వేణుగోపాల్‌ పాల్గొన్నారు. గురువారం మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పుష్పయాగం జరిపించనునానరు. అనంతరం తిరువీధి ఉత్సవం చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement