పలమనేరు మార్కెట్‌యార్డ్ సమీపంలో వైఎస్సార్ విగ్రహం వద్ద చేపట్టిన నిరాహార దీక్షలో నియోజకవర్గ సమన్వయకర్త వెంకటేగౌడ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను నిలువునా మోసం చేసిందన్నారు. అర్హులకు పోస్టులు ఇవ్వకుండా అడ్డదారిలో తమ వారికి పోస్టులు విక్రయించారని మండిపడ్డారు. అవకతవకలపై విచారణ జరిపించి అర్హులకు న్యాయం చేయాలని కోరారు.
చిత్తూరు కార్పొరేషన్: కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ–2025లో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయని నిరుద్యోగ, విద్యార్థి సంఘాలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నాయి. ఒక్కో పోస్టును రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు విక్రయించి అర్హులకు అన్యాయం చేశారని మండిపడుతున్నాయి. వారికి వైఎస్సార్ సీపీ మద్దతు తెలిపింది. అర్హులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టంచేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలకు పిలుపునిచ్చింది. డీఎస్సీలో అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని పట్టుబట్టింది. నాయకులు, కార్యకర్తలు, డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులు, ప్రజలు నిరాహార దీక్షల్లో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా గురువారం చేపట్టిన రిలే నిరహారదీక్షలకు విశేష స్పందన లభించింది. ఆడికృత్తిక పండుగ ఉన్నప్పటికీ పెద్ద సంఖ్యలో యువకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
జీడీనెల్లూరులో చేపట్టిన నిరాహార దీక్షా శిబిరంలో మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మి
డీఎస్సీ పేరుతో దగా
జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ నిరాహార దీక్షలు


