రాజకీయం | - | Sakshi
Sakshi News home page

రాజకీయం

Aug 7 2026 2:02 AM | Updated on Aug 7 2026 2:02 AM

● గత ప్రభుత్వంలో రూ.4.5 కోట్లతో గంగమ్మ ఆలయ అభివృద్ధి ● గత ఏడాది కూటమి ప్రభుత్వంలో మరమ్మతులు ● తాజాగా గర్భగుడి మార్పునకు స్తపతి మార్కింగ్‌ ● గంగమ్మ ఆలయంలో ఏదో జరుగుతోందని స్థానికుల చర్చ

గంగమ్మ ఆలయంలో

కుప్పం : కుప్పం ప్రజల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయంపై కూటమి నేతలు రాజకీయాలు చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో రూ.4.5 కోట్లతో గర్భగుడిని నిర్మించారు. ఈ ఏడాది జాతరను సైతం ఘనంగా నిర్వహించారు. ఆలయం సుందరంగా ఉండడంతో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని భావించిన కూటమి నేతలు రాజకీయం మొద లు పెట్టారు. గర్భగుడి చుట్టూ ఉన్న ప్రహరీ గోడను తొలగించి మరమ్మతులు చేపట్టారు. తాజాగా గర్భగుడిని తొలగించి మళ్లీ నిర్మించాలని పాలక వర్గం నిర్ణయించింది. ఈ మేరకు ఆలయ స్తపతితో కలిసి మార్కింగ్‌ కూడా వేయించారు. దీనికి ఆలయ అర్చకులు అంగీకరించడం లేదు. అనేక ఏళ్ల క్రితం గర్భగుడిని నిర్మించారని, దాన్ని పడగొట్టి స్థలాన్ని మార్పు చేయడం వల్ల అరిష్టం కలుగుతుందని వా పోతున్నారు. ఆలయంపైనా రాజకీయం చేయడంపై స్థానికులు, భక్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

వైఎస్సార్‌ సీపీ హయాంలో

రూ.4.5 కోట్లతో నిర్మాణం

గత ప్రభుత్వం హయాంలో శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ దేవాలయం గర్భగుడిని రూ.4.5 కోట్ల పునర్‌నిర్మించారు. గోడలు, పైకప్పు పడగొట్టి రాతితో కట్టడం చేపట్టారు. అమ్మవారి మూలమూర్తి పీఠాన్ని మార్చకుండా రెండు అడుగులు ఎత్తు పెంచి నిర్మాణం చేపట్టారు. గర్భగుడి రాతి కట్ట డాలు పూర్తిగానే 2023లో అమ్మవారి జాతర జరిపించారు. అనంతరం గోపురాన్ని కూడా రాతితోనే నిర్మించాలని భావించినా వీలుకాకపోవడంతో ఇటుకలతోనే నిర్మించారు. ఇప్పుడు మారిన రాజకీయ పరిణామాలతో పెయింటింగ్‌ పనులు చేపట్టాల్సి ఉండగా పనులు ఆగిపోయాయి.

ప్రహరీ గోడ మరమ్మతులు

2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుపతి గంగమ్మ ఆలయ ప్రాంగణం చుట్టూ దాతల సహాయంతో పనులు చేపట్టారు. ఆలయం వెనుక ఉన్న నాగులరాళ్లు, రచ్చకు మరమ్మతులు చేపట్టారు. నూతనంగా నాగల రాళ్లు ప్రతిష్టించారు. ప్రస్తుత గంగమ్మ దేవాలయం పునర్‌నిర్మాణం జరిగిన తర్వాత జాతర సమయంలో విశ్వరూప దర్శనం రోడ్డుపైన నిలబడిన భక్తులకు సంపూర్ణంగా అమ్మవారు కనబడుతుండడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పుడు గర్భగుడి స్థలం మార్చాలని నిర్ణయం

ప్రస్తుతం తిరుపతి గంగమ్మ దేవాలయం గర్బగుడి స్థలాన్ని మార్చాలని ఆలయ పాలక వర్గం భావిస్తోంది. మూలమూర్తిని ప్రస్తుతమున్న స్థానంలో కాకుండా కొంచెం వెనుకకు జరిపి నూతనంగా గర్భగుడిని నిర్మించాలని ఆలయ కమిటీ సభ్యులు నిర్ణయించారు. 115 ఏళ్ల చరిత్ర కలిగిన అమ్మవారి పీఠం, గర్భగుడిని మార్చేందకు విజయవాడ నుంచి స్తపతిని పిలిపించి మార్కింగ్‌ వేయించారు. మూడే ళ్ల క్రితం రూ.4.5 కోట్లతో నిర్మించిన రాతి కట్టడాలను కూలదోసి నూతనంగా గర్భగుడి నిర్మాణం చేపట్టాలని నిర్ణయించడం సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయ. ఇప్పుడే దేవాలయం అలకారంగా బాగుంది. దీన్ని మళ్లీ నిర్మించే ఉద్దేశం ఏమి టో భక్తులకు అర్థం కాని విషయంగా మారింది.

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న పోస్టులు

గంగమ్మ దేవాలయం నిర్మాణంపై సోషల్‌ మీడియా లో పోస్టులు వైరల్‌ అవుతున్నాయి. అభివృద్ధిని అడ్డుకోవద్దని అధికార పక్షం ఒక వైపు, అమ్మవారి పీఠం మారిస్తే అరిష్టమంటూ ఆలయ పూజారుల బృందం మరో వైపు పోస్టులను వైరల్‌ చేస్తున్నారు. కడా పీడీ ప్రకటన మేరకు అమ్మవారి పీఠం మారిస్తే భక్తుల మనోబావాలు దెబ్బతింటాయనే విధంగా వినతి పత్రాలు ముద్రించి పట్టణంలో పంపిణీ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement