పలమనేరు: ప్రేమ వ్యవహారం కారణంగా ఓ యువకుడిని కిడ్నాప్ చేసిన ఘటన శుక్రవారం పలమనేరు మండలంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కొలమాసనపల్లి పంచాయతీ నడిమి కల్లాడుకు చెందిన సంతోష్‌రెడ్డికి కుప్పం నియోజకవర్గంగుడుపల్లి మండలం చామనేరుకు చెందిన యువతితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఈ విషయం తెలుసుకున్న ఆ యువతి అన్న తన స్నేహితులతో కలిసి సంతోష్‌రెడ్డిని కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. కుప్పం సమీపంలోని పీఈఎస్ ఆస్పత్రి వద్ద దాడి చేసినట్టు తెలిసింది. దీంతో బాధితుని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదుచేసి విచారిస్తున్నారు.
రాష్ట్రస్థాయి పోటీలకు
కేడీసీ విద్యార్థులు
కుప్పంరూరల్: ఈ నెల 11 నుంచి 13 వరకు తిరుపతిలో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్ పోటీలకు కుప్పం డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎంపికై నట్లు ప్రిన్సిపల్ డి.సుధారాణి తెలిపారు. కళాశాలలో చదువుతున్న అర్చన హైజంప్, లాంగ్ జంప్, కె.దర్శిని 100, 400 మీటర్ల పరుగు పందెంలో, జి. సుచిత్ర 100, 200 మీటర్ల పరుగు పందెంలో పాల్గొననున్నట్లు చెప్పారు. అలాగే ఆర్.చందన షాట్ పుట్, డిస్క్‌త్రో, నందిని లాంగ్ జంప్, ఎస్.సురక్ష షాట్‌పుట్, జి.ఎస్.మౌనిష్ జావెలిన్ త్రో, షాట్ పుట్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు చెప్పారు. చిత్తూరులో జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో గెలుపొందిన విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ సుధారాణి తెలిపారు. విద్యార్థులను, వారికి శిక్షణ ఇచ్చిన ఫిజికల్ డైరెక్టర్ సుధాకర్‌ను కళాశాల వైస్ చైర్మన్ సాగర్‌రాజ్ అభినందించారు.


