అబ్కారీ మద్య నియంత్రణ శాఖ (ఎకై ్సజ్) పనితీరు ప్రస్తుతం దయనీయ పరిస్థితుల్లో ఉంది. ప్రతి నెలా మద్యం ప్రియులకు రూ.కోట్ల విలువైన మద్యం తాగిస్తున్న ఎకై ్సజ్ అధికారులకు కనీసం తాగడానికి నీళ్లు కూడా ఇవ్వడం లేదు. కూటమి ప్రభుత్వం రెండేళ్లుగా రవాణా భత్యం, ఏడాదిగా అద్దె వాహన బిల్లులు మంజూరు చేయలేదు. ఉన్న సిబ్బందితోనే నెట్టుకొస్తుంటే ఉద్యోగుల సర్దుబాటు పేరిట.. మరికొందరిని పక్క జిల్లాలకు పంపించే ఏర్పాట్లు జరగుతున్నాయి. పర్యవసనం.. ఈ విభాగంలో ఎకై ్సజ్ చేయలేక అధికారులు–సిబ్బంది నలిగిపోతున్నారు.
వేధిస్తున్న సిబ్బంది
కొరత
మరోవైపు స్టేషన్లలో సిబ్బంది కొరత ఎకై ్సజ్‌శాఖను వేధిస్తోంది. ఎనిమిది స్టేషన్లలో ఇప్పటికే దాదాపు 200 పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 20 ఏళ్ల క్రితం జరిగిన నియామకాలు తప్ప.. మళ్లీ ఇప్పటి వరకు ఎకై ్సజ్ శాఖలో ఖాళీల భర్తీకి నోచుకోలేదు. ఇక ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియలో జిల్లాలో ఉన్న 130 మందికి పైగా సిబ్బందిని ఇతర జిల్లాలకు పంపనున్నట్లు తెలుస్తోంది. ఇదేగనుక జరిగితే మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు.. ఎకై ్సజ్ పరిపాలన పూర్తిగా నిర్వీర్యం కావడం ఖాయం.
చిత్తూరులోని ఎకై ్సజ్ అర్బన్ పోలీస్ స్టేషన్
ఓవైపు ఊరూరా బెల్టు దుకాణాలు.. అక్రమ మద్యం
చిత్తూరు అర్బన్: జిల్లాలో చిత్తూరు అర్బన్, చిత్తూ రు రూరల్, కార్వేటినగరం, నగరి, పుంగనూరు (నాలుగు మండలాలు), పలమనేరు, కుప్పం, పులిచెర్ల (మూడు మండలాలు)ల్లో ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. మొత్తం 31 మండలాల పరిధిలో ప్రభుత్వం విధించే ప్రతి నెలా లక్ష్యాన్ని ఎకై ్సజ్ అధికారులు చేరుకోవాల్సిందే. ఇందులో ఎవ్వరికీ ఎలాంటి మినహాయింపు ఉండదు. నెలకు దాదాపు రూ.50 కోట్ల విలువైన మద్యాన్ని తాగించడంలో లక్ష్యాలు కేటాయిచి మరీ ప్రభుత్వం, అధికారులకు బాధ్యతలను అప్పగిస్తోంది. వీటిని వంద శాతం అమలు చేయాల్సిందే. ఇక పక్క రాష్ట్రాల నుంచి మద్యం అక్రమంగా జిల్లాలోకి రాకుండా చేయడం, నాటు సారా నియంత్రించడం, బెల్టు దుకాణాలు ఉండకుండా చేయాలనే విధులు సైతం అబ్కారీ శాఖ చూస్తోంది.
బిల్లులు ఇవ్వరా?
జిల్లాలోని ఎనిమిది అబ్కారీ శాఖ పోలీస్ స్టేషన్లతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్, టాస్క్‌ఫోర్స్ పేరిట ఉన్న రెండు విభాగాలు తప్పనిసరిగా గ్రామాల్లో ప్రతి రోజూ తిరగాల్సిందే. నాటు సారా తయారీని నిర్మూలించడంతో పాటు, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ (ఎన్‌డీపీఎల్)ను అరికట్టడానికి స్టేషన్ ఎస్‌హెచ్‌వోలకు నెలకు రూ.33 వేలు చెల్లించేలా అద్దె జీపులు ఉన్నాయి. కానీ ఏడాదిగా రూపాయి కూడా వాహన అద్దె బిల్లులు విదల్చలేదు. జేబులో ఉన్న డబ్బులు పెట్టుకుని ఇంధనం నింపుకున్నా.. ఏళ్ల తరబడిగా బిల్లులు ఇవ్వకపోవడంతో ఖాకీ దుస్తు లు ధరించిన అధికారుల్లో కొందరు మద్యం వ్యాపారుల వద్ద చేయి చాచాల్సిన పరిస్థితులు నెలకొన్నా యి. దాదాపు రూ.5 లక్షల అద్దె వాహన బిల్లులు, రెండేళ్లుగా రవాణా భత్యం ఇవ్వకపోవడంతో రూ.6 లక్షలకు పైగా బకాయిలు పేరుకున్నాయి.


