కృషి ఒకరిది.. ప్రచారం మరొకరిది! | - | Sakshi
Sakshi News home page

కృషి ఒకరిది.. ప్రచారం మరొకరిది!

Aug 10 2026 1:40 AM | Updated on Aug 10 2026 1:40 AM

● పుత్తూరులో రైల్వే అండర్‌ సబ్‌వేకి రూ.2.47 కోట్లు మంజూరు ● నాలుగేళ్ల మాజీ మంత్రి ఆర్కే రోజా కృషి ఫలితం ● నేడు ఆ ఘనత తమదంటూ ఎమ్మెల్యే క్రెడిట్‌ చోరీ

పుత్తూరు: మాజీ మంత్రి ఆర్కే రోజా అలుపెరగని పో రాట ఫలితంగా పుత్తూరు పట్టణంలోని శ్రీధర్మరాజుల ఆలయ సమీపంలో రైల్వే అండర్‌ సబ్‌వే నిర్మాణానికి రైల్వేశాఖ రూ.2.47 కోట్లు మంజూరు చేసింది. ఫలితంగా గేట్‌పుత్తూరు వాసులతో పాటు చుట్టుపక్కల పది గ్రామాల ప్రజల రాకపోకలకు మార్గం సుగమం అయ్యింది. దశాబ్దాల తమకల నిజమవుతోందని స్థా నికులు రోజమ్మకు కృతజ్ఙతలు తెలుపుతున్నారు. అయితే దీనిని స్థానిక టీడీపీ నేతలు తమ అధినేత, సీ ఎం చంద్రబాబునాయుడు వారసత్వంగా క్రెడిట్‌ చోరీ కి పాల్పడుతున్నారని స్థానిక ప్రజలు నవ్వుకొంటున్నారు. పట్టువదలని విక్రమార్కుడిలా మాజీ మంత్రి రోజా పోరాట గురుతులు కళ్ల ముందు కనిపిస్తుంటే, తామే సాధించినట్లు స్థానిక ఎమ్మెల్యే భానుప్రకాష్‌ ప్ర చారం చేసుకోవడం పట్ల చెవులు కొరుక్కుంటున్నారు.

ప్రజల కోసం రోజమ్మ పోరాటం ఇలా..

పుత్తూరు పట్టణాన్ని రెండుగా చీల్చుతూ ఉన్న రైల్వేట్రాక్‌ను దాటుతూ రోజువారి పనులకు పరుగులు పెట్టే స్థానిక ప్రజలకు భద్రత కల్పించాలంటూ మాజీ మంత్రి ఆర్కే రోజా అధికారంలో ఉన్నా లేకున్నా గత నాలుగేళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. 2023 ఆగస్టు 16న నాటి పర్యాటక శాఖ మంత్రి హోదాలో అర్కే రోజా అప్పటి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలసి అభ్యర్థించారు. గత ఏడాది నవంబర్‌ 28న తిరుపతి ఎంపీ గురుమూర్తి ద్వారా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు మరోదఫా వినతి పత్రం ఇప్పించారు. ఇటీవలే ఢిల్లీలో మరోమారు రైల్వే మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు. ఇలా పట్టువదలని విక్రమార్కుడిలా రైల్వే మంత్రి వెంటబడడంతో పుత్తూరులో రైల్వే సబ్‌వే నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌ పడింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు గత ఏప్రిల్‌ 29న పుత్తూరుకు వచ్చిన డివిజినల్‌ రైల్వే మేనేజర్‌ శైలేంద్రసింగ్‌ మాజీ మంత్రి రోజాతో కలసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. రోజా అభ్యర్థన మేరకు శ్రీధర్మరాజుల ఆల యం ఎదురు గా రైల్వే సబ్‌వే నిర్మాణానికి అంగీకారం తెలిపారు. ఆ మేరకు రైల్వే శాఖ నిదులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement