నగరి : నగరి దళితవాడ ఎదురుగా జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. దీంతో ఇద్దరు యువకులు మృతిచెందారు. అతివేగ మే ఇందుకు కారణమని స్థానికులు తెలిపా రు. పోలీసుల కథనం మేరకు.. చింతలపట్టెడ దళితవాడకు చెందిన చినరాసు అలియాస్ మురుగన్ (21), భీమానగర్‌కు చెందిన రఘుబాల (19) ఏర్పేడు సమీపంలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. సోమవారం సాయంత్రం విధులు ముగించుకుని బైక్‌లో స్వగ్రామాలకు బయలుదేరారు. అతివేగంతో వస్తుండడంతో నగరి దళితవాడ సమీపంలోని మలుపు వద్ద బైక్ అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. మురుగన్ రోడ్డుపైనే ఎగిరిపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రఘుబాల డివైడర్ దాటి అవతలి వైపు మట్టిరోడ్డుపై పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి కొన ఊపిరితో ఉన్న అతన్ని అంబులెన్స్‌లో నగరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ మృతిచెందాడు.
మురుగన్ (ఫైల్)
రఘుబాల (ఫైల్)
అతివేగమే కారణం
ఈ ప్రమాదం ఎంత భయానకంగా జరిగిందో బైక్ పరిస్థితే చెబుతోంది. బైక్ ఒక డివైడర్‌ను ఢీకొని మరోవైపు ఉన్న డివైడర్‌ను దాటి వెళ్లిపడింది. దీన్ని బట్టి బైక్ ఎంత వేగంతో ప్రయాణిస్తోందో తెలుస్తోంది. మురుగన్‌కు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. రెండేళ్ల కూతురు, ఏడాది వయస్సు గల కుమారుడు ఉన్నారు. కుటుంబానికి అండగా నిలవాల్సిన యువకుడు దూరం కావడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. రఘుబాల తన తల్లిదండ్రులకు ఒక్కడే మగసంతానం. తమకు ఆధారంగా ఉంటాడని ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల కళ్లముందే కుమారుడు కన్నుమూయడంతో వారి రోదనలు మిన్నంటాయి. ఆస్పత్రి ఆవరణలో విషాదచాయలు అలుముకున్నాయి. అక్కడికి చేరుకున్న బంధువులు, స్నేహితు లు కన్నీరు మున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న నగరి సీఐ మల్లికార్జున సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ విషాద ఘటన మరోసారి ‘అతివేగమే ప్రమాదాలకు ప్రధాన కారణం‘ అనే చేదు నిజాన్ని గుర్తు చేసింది. కొన్ని నిమిషాలు ముందుగా చేరాలనే తొందర రెండు కుటుంబాలకు జీవితాంతం తీరని కన్నీటిని మిగిల్చింది.


