కాణిపాకం ఆలయానికి విరాళాలు | - | Sakshi
Sakshi News home page

కాణిపాకం ఆలయానికి విరాళాలు

Aug 2 2026 1:28 AM | Updated on Aug 2 2026 1:28 AM

కాణిపాకం: కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానానికి శనివారం పలువరు భక్తులు విరాళాలు అందజేశారు. తిరుచానూరుకు చెందిన దాత ఏ.సూర్య పవన్‌ కుటుంబ సభ్యులు స్వామివారికి రూ.38 లక్షల విలువైన 12 కిలోల వెండి కవ చాలను (సర్వాంగ కవచం, తొండం, హస్తాలు, చెవు లు) సమర్పించారు. దాతలకు ఆలయ ఈవో పెంచల కిషోర్‌, చైర్మన్‌ మణి నాయుడు ప్రత్యేక దర్శనం కల్పించి శేషవస్త్రం, తీర్థప్రసాదాలు అందజేశారు. అలాగే నిత్య అన్నదాన ట్రస్టుకు గుంటూరుకు చెందిన రామ్మోహన్‌ రావు రూ.1,00,116, తూర్పు గోదావరికి చెందిన సూర్యనారాయణ రూ.1,00,016, వై ఎస్‌ గేట్‌కు చెందిన గంగారపు హరిబాబు నాయుడు రూ.1,00,116 చెక్కు రూపంలో విరాళాలు అందించారు. ఏఈఓ ధనపాల్‌, సూపరింటెండెంట్‌ వాసు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ బాలాజీ నాయుడు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement