నూటికి రూ.20 వడ్డీ | - | Sakshi
Sakshi News home page

నూటికి రూ.20 వడ్డీ

Aug 3 2026 12:37 AM | Updated on Aug 3 2026 12:37 AM

అప్పు కట్టకుంటే దాడులు, దౌర్జన్యాలు

మరోవైపు తమిళ తంబీల ఫైనాన్స్‌

పట్టణంలో పలు అనధికారిక ఫైనాన్స్‌ సంస్థలు

ఇబ్బంది పడుతున్న ప్రజలు

పలమనేరు: పట్టణంలో కొందరు అనధికారిక వడ్డీ వ్యాపారులు సాగిస్తున్నా రు. ప్రజల అవసరాన్ని బట్టి నూటికి రూ.10 నుంచి రూ.20 వరకు వడ్డీ వ సూలు చేస్తున్నట్టు బాధితులు చెబుతున్నారు. పలువురు మహిళలు చుట్టుపక్కల ఉన్న వారికి ఇలా అధిక వడ్డీలకు అప్పులిస్తున్నట్టు తెలు స్తోంది. వడ్డీలకు డబ్బులివ్వాలంటే అధికారుల నుంచి అనుమతులు పొందాలనే విషయం కూడా వీరికి తెలియదు. దీంతో అడిగేవారే లేరని ఇష్టానుసారంగా అధిక వడ్డీలతో జనాన్ని పీడిస్తున్నారు.

తమిళ తంబీల ఫైనాన్స్‌ గోల

పలమనేరు ప్రాంతం తమిళనాడుకు ఆనుకుని ఉండడంతో ఆ రాష్ట్రానికి చెందిన గుడియాత్తం, వేలూరు తదితర ప్రాంతాలకు చెందిన వడ్డీ వ్యాపారులు గ్రామాల్లోని చిరు వ్యాపారులను టార్గెట్‌ చేస్తూ అధిక వడ్డీలకు నగదు ఇస్తున్నారు. వీరు సకాలంలో కంతులు కట్టకుంటే దాడులు, దౌర్జన్యాలకు దిగుతున్నారు. బాధితుల పింఛను కార్డులు, రేషన్‌ కార్డులు, ఆధార్‌ కార్డులను ముందుగానే స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.

లబోదిబోమంటున్న బాధితులు

ఏదో అవసరాల కోసం అప్పు చేసిన బాధితులు అధిక వడ్డీలు కొన్నాళ్లు కట్టి ఆపై కట్టక అసలు, వడ్డీ పెరిగి దాన్ని చెల్లించక ఇబ్బందులు పడుతున్నారు. అప్పులిచ్చే వారు ఎంతమేరకు వడ్డీ వసూలు చేయాలనే అంశం వడ్డీ నియంత్రణ అధికారి పర్యవేక్షణలో జరగాలి. ఎవరూ అధుక వడ్డీలపై చర్యలు తీసుకోకపోవడంతో వడ్డీ వ్యాపారులు ఆడిందే ఆటగా తయా రైంది. ఇప్పటికై నా జిల్లా అధికారులు ఇలాంటి అధిక వడ్డీలపై చర్యలు తీసుకోవాల్సి ఉంది.

పలమనేరు పట్టణంలోని గంటావూరు బీసీ కాలనీకి చెందిన గంగాదేవికి భర్త లేడు. కొన్నేళ్ల క్రితం ఇక్కడికి వచ్చి స్థిరపడింది. చిల్లరకొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తోంది. తన అవసరం నిమిత్తం ఒక మహిళ ద్వారా రూ.లక్ష అప్పు తీసుకుంది. ఇందుకు గాను రూ.10ల చొప్పున వడ్డీ చెల్లించింది. ఆపై వ్యాపారం సరిగ్గా సాగకపోవడంతో డబ్బు చెల్లించలేకపోయింది. దీంతో అప్పు ఇచ్చిన వడ్డీ వ్యాపారి ఆమె ఇంట్లో లేనప్పుడు ఇంటిని స్వాధీనం చేసుకుంది. బాధితురాలు స్థానిక పోలీసులను ఆశ్రయించింది. ఇదే గంటావూరు కాలనీకి చెందిన కొందరు అధిక వడ్డీలు కట్టలేక గ్రామాన్ని వదిలి గతంలో పారిపోయారు. పట్టణంలోనే కాకుండా గ్రామాల్లోనూ అధిక వడ్డీ వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి.

అనధికారిక ఫైనాన్స్‌

సంస్థల కార్యకలాపాలు

మరోవైపు పట్టణంలో పదుల సంఖ్యలో అనధికారిక ఫైనాన్స్‌ సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. వీరు డైలీ, వీక్లీ ఫైనాన్స్‌లను ఇస్తుంటారు. ఎవరైనా అప్పు తీసుకుని కంతు చెల్లించకుంటే బాధితులపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా తమిళనాడు నుంచి వచ్చే డైలీ ఫైనాన్స్‌ ఏజెంట్లు ఏమాత్రం భయపడకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారు.

వడ్డీ వ్యాపారుల దందా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement