చిత్తూరు కలెక్టరేట్ : ప్రస్తుత విద్యాసంవత్సరంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో విప్లవాత్మకమైన మార్పులు రావాలని డీఈవో లక్ష్మీనారాయణ ఆదేశించారు. గత విద్యా సంవత్సరంలో జిల్లాలో తక్కువ పురోగతి సాధించిన 75 పాఠశాలల ప్రధానోపాధ్యాయుల తో శుక్రవారం చర్చావేదిక నిర్వహించారు. డీఈవో మాట్లాడుతూ పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలబెట్టేందుకు ప్రత్యేక ప్రణాళికను మొద లుపెట్టినట్లు తెలిపారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో గతంలో తక్కువ ఫలితాలు సాధించిన 75 పాఠశాలల్లో 100 శాతం అత్యుత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఉత్తమ ఫలితాలకు ఎలాంటి ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలి, బోధనా పద్ధతుల్లో మార్పులు ఎలా తీసుకురావాలి అనే అంశాలపై సుదీర్ఘంగా, క్షు ణ్ణంగా చర్చించినట్లు తెలిపారు.
అకడమిక్ పరంగా పూర్తి మద్దతు
ప్రభుత్వ పాఠశాలల్లో అకడమిక్ పరంగా పూర్తి మద్దతు తన నుంచి ఉంటుందని డీఈవో అన్నారు. గత ఏడాదిలో నమోదైన స్వల్ప ఫలితాలు ఈసారి ఏమాత్రం పునరావృత్తం కాకుండా ప్రతి పాఠశాల హెచ్‌ఎం ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పదవ తరగతి చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థి అభ్యసన సామర్థ్యాన్ని విడివిడిగా అంచనా వేస్తూ వారిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. త్వరలో 75 పాఠశాలల్లోని సబ్జెక్ట్ టీచర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
కాగితాలకే పరిమితం కాకూడదు
ప్రధానోపాధ్యాయులు ప్రణాళికలను కాగితాలకే పరిమితం చేయకుండా వాటిని కచ్చి తంగా అమలు చేయాలని జిల్లా సమగ్రశిక్ష శాఖ ఏపీసీ వెంకటరమణ అన్నారు. విద్యార్థులు ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠ శాలకు వచ్చేలా హెచ్‌ఎంలు, ఉపాధ్యాయు లు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి సబ్జెక్ట్ టీచర్ బాధ్యతాయుతంగా పది మంది వెనుకబడిన విద్యార్థులను దత్తత తీసుకుని ప్రత్యేక శ్రద్ధ పెట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ చర్చావేదికలో డీవైఈవో ఇందిరా, డీసీఈబీ సెక్రటరీ హేమాద్రి, ఎంఈవోలు హసన్‌బాషా, రమేష్, ప్రసాద్, ప్రధానోపాధ్యాయులు అరుణ్‌కుమార్, బాలచైతన్య, తదితరులు పాల్గొన్నారు.
చర్చావేదికలో మాట్లాడుతున్న డీఈవో లక్ష్మీనారాయణ, హాజరైన తక్కువ పురోగతి సాధించిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు


