చిత్తూరు అర్బన్ : చిత్తూరులోని ప్రథమ ప్రత్యే క ద్వితీయ శ్రేణి మేజిస్ట్రేట్ కోర్టు సోమవారం మద్యం సేవించి వాహనాలు నడిపిన ఎనిమిది మందికి ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున జరిమానా విధించింది. ట్రాఫిక్ సీఐ జి.నిత్యబాబు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ ల్లో వారు పట్టుబడ్డారు. మద్యం సేవించి వాహ నాలు నడపడం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉందని, రోడ్డు భద్రతా నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
12 ఏళ్ల తర్వాత
నిందితులకు జైలు శిక్ష
గంగవరం: 12 ఏళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో నిందితులకు జైలు శిక్ష విధిస్తూ పలమనేరు కోర్టు స్పెషల్ జడ్జి రాధమ్మ సోమవారం తీరు చెప్పారు. గంగవరం అర్బన్ సీఐ రాంభూపాల్ కథనం మేరకు.. 2014లో మండలంలోని మదర్‌థెరిసా కళాశాల వద్ద ఆటో ప్రమాదం జరిగి ఒకరు మృతి చెందగా మరో నలుగురు గాయపడ్డారు. అప్పట్లో బాధితుడు క్రిష్ణప్ప గంగవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఆటో డ్రైవర్ షఫివుల్లాపై నేరం రుజువు కావడంతో 11 నెలల 15 రోజులు జైలు శిక్ష, రూ.3 వేలు జరిమానా, ఆటో యజమాని జయచంద్రకు రూ.వెయ్యి జరిమానా లేదా రెండు నెలలు జైలు శిక్ష విధించారు.
విద్యార్థులు శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలి
చిత్తూరు కలెక్టరేట్ : విద్యార్థులు శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని మెక్సికో యూనివర్సిటీ ప్రొఫెసర్ మోహన్ కుమార్ తెలిపారు. చిత్తూరులోని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం నానో పదార్థాలు, వాటి అనువర్తనా లు అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నానో పదార్థాల నిర్మాణం, తయారీ విధానాలు, ప్రత్యేక లక్షణాలపై విద్యార్థులు పట్టుసాధించాలన్నారు. వైద్యరంగం, ఔషధ పంపిణీ, శక్తి ఉత్పత్తి, పర్యావరణ పరిరక్షణ, నీటి శుద్ధి వంటి రంగాల్లో నానో సాంకేతికత కీలకపాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న తాజా పరిశోధనలు, ఉన్నత విద్య, పరిశోధనా అవకాశాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. ప్రిన్సిపాల్ జీవనజ్యోతి మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయి శాస్త్రవేత్తలతో ఉపన్యాసాలు ఏర్పా టు చేయడంతో విద్యార్థులకు ప్రపంచ స్థాయి విజ్ఞానాన్ని అందిస్తున్నామని తెలిపారు. అనంతరం విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. అధ్యాపకులు శశికళ, భానుప్రకాష్ పాల్గొన్నారు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
యాదమరి: మండలంలోని కీనాటంపల్లి గ్రామ దళితవాడలో గత నెల 27న జరిగిన వివాదం తీవ్ర రూపాన్ని దాల్చింది. ఈ ఘటనకు సంబందించి ఇరువర్గాల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు.. కీనాటంపల్లిలో జరిగిన సంఘటనపై జూలై 31న అదే గ్రామానికి చెందిన పౌలు, గోపీనాథ్ నాయుడు స్థానిక పోలీసు స్టేషన్లో వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. పౌలు ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. దీనికి కౌంటర్‌గా గోపీనాథ్‌నాయుడు ఇచ్చిన ఫిర్యాదుపైనా మరొక కేసు నమోదైంది. ఈ కేసు తీవ్రత దృష్ట్యా చిత్తూరు డీఎస్పీ వెంకటనారాయణ సోమవారం స్వయంగా రంగంలోకి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ఇరుపక్షాల సాక్షులను విచారించి వివరాలు సేకరించారు. భూవివాదం కారణంగానే ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగిందని స్థానికులు చెబుతున్నారు.
ట్రాక్టర్‌ను ఢీకొన్న మినీ లారీ
– డ్రైవర్ మృతి
గంగవరం: మండలంలోని గోశాల వద్ద సోమ వా రం రాత్రి ట్రాక్టర్‌ను మినీ లారీ ఢీకొనడంతో డ్రైవర్ మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. చెన్నారెడ్డిపల్లికి చెందిన జగదీష్(24) సొంతంగా మినీ లారీ కొనుక్కుని బాడుగలు తోలుకుంటున్నాడు. పత్తికొండ వద్ద టమాటా బాక్సు లు లోడ్ చేసుకుని పలమనేరు మార్కెట్‌కు వెళ్తున్నాడు. గంగవరం మండలం గోశాల వద్ద ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొన్నాడు. జగదీష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు అతన్ని పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. లారీ ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ట్రాక్టర్ డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పరారైనట్టు తెలిసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి ఏడాది క్రితమే పెళ్లి అయింది.


