వరిసిద్ధుని ఆలయం వద్ద అలంకరణ
కాణిపాకం : కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో శాకంబరీ దేవి ఉత్సవాలను బుధవారం వైభవంగా నిర్వహించారు. ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని ప్రధాన ఆలయంతో పాటు, శ్రీమణికంఠేశ్వరుని ఆలయంలో కూరగాయలు, పండ్లతో స్వామివార్లను దివ్యంగా అలంకరించారు. ఉత్సవాల కోసం పలమనేరు, వడ్డిపల్లి, కోలార్, ముల్బాగల్, హోసూర్ తదితర మార్కెట్ల నుంచి రైతులు, వ్యాపారులు, రవీంద్ర రెడ్డి, మిత్రబృందంతో కలిసి సుమారు 15 టన్నుల వివిధ రకాల కూరగాయలు, పండ్లను స్వామివారికి విరాళంగా సమర్పించారు. దాతలకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. తీర్థప్రసాదాలు అందించారు. ఈఓ పెంచల కిషోర్, ఆలయ కమిటీ చైర్మన్ మణి నాయుడు పాల్గొన్నారు.


