బంధువులే నిందితులు | - | Sakshi
Sakshi News home page

బంధువులే నిందితులు

Aug 6 2026 2:14 AM | Updated on Aug 6 2026 2:14 AM

● ఇద్దరిని అరెస్ట్‌ చేసిన పోలీసులు

● ఇద్దరిని అరెస్ట్‌ చేసిన పోలీసులు

పుత్తూరు: గత నెల 31వ తేదీన నమోదైన పోక్సో కేసులో మంగళవారం ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. వారిలో పి.మురళి(37), టి.హరికృష్ణ(30) ఉన్నారు. వీరు బాలికకు సమీప రక్త సంబంధీకులు కావడం విశేషం. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక గర్భం దాల్చడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

బైరెడ్డిపల్లె : మండలంలోని కడపనత్తంలో బుధవారం అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన క్రిష్ణమూర్తి (54)కి పెళ్లి కాలేదు. ఒంటరిగా ఉంటున్నాడు. ఏమి జరిగిందో కాని మంగళవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు బుధవారం పోలీసులు, బంధువులకు సమాచా రం అందించారు. మృతుడి అన్న కుమారుడు ఉమామహేశ్వర్‌ ఫిర్యాదు చేశారు. క్రిష్ణమూర్తికి ఎవరితోనూ కక్షలు లేవని, మృతిపై అనుమానంగా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎస్‌ఐ చందనప్రియ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

టీడీపీ మహిళా నేతపై కేసు

చిత్తూరు అర్బన్‌: తమను కించపరిచేలా వ్యవహరించారని ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు టీడీపీ మహిళా నేత, ఆమె భర్తపై బుధవారం వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల చామంతిపురానికి చెందిన హిందూశ్రీని కించపరుస్తూ టీడీపీ మహిళా నేత రేఖ సెల్ఫీ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన హిందూశ్రీ వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పరిశీలించిన వారు రేఖ, ఆమె భర్తపై కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement