ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలు సాధించాలి | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలు సాధించాలి

Aug 6 2026 2:38 AM | Updated on Aug 6 2026 2:38 AM

– 10లో

నగరిలో భారీ చోరీ
నగరి పట్టణంలోని ఒక ఇంట్లో దొంగలు పడ్డారు. 15 సవర్ల బంగారు ఆభరణాలను చోరీ చేశారు.

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలును వైద్యాధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ నాగ శశిభూషణ్‌ రెడ్డి ఆదేశించారు. ఆయన బుధవారం తన కార్యాలయంలో జిల్లాలోని వైద్యాధికారులు, పర్యవేక్షకులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నిత్య సేవారంగ వివరాల జాబితాలను ఈ నెలాఖరులోగా డిజిటల్‌ రూపంలోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. ఆరోగ్య సంరక్షణ సూచికలు, హెచ్‌ఎంఐఎస్‌ గణాంకాల నమోదులో మెరుగైన పనితీరు కనబరిచిన సిబ్బందిని అభినందించారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ నిరోధక టీకాల పంపిణీలో వెనుకబడిన పీహెచ్‌సీల్లో వంద శాతం లకా్‌ష్య్‌న్ని సాధించాలని ఆదేశించారు. ప్రతి ఆరోగ్య కార్యకర్త రోజుకు తప్పనిసరిగా దంపతులు, గర్భిణులు, చిన్నారుల నమోదులో కనీసం ఒక ఎంట్రీ చేయాలన్నారు. వైద్యశాలల ఆవరణలో పారిశుద్ధ్యాన్ని పక్కాగా నిర్వహించాలని, ప్రజా సంతృప్తి సూచిక 80 శాతం పైగా ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. సంజీవిని శస్త్ర చికిత్సలు, అసంక్రమిత రోగ నిర్ధారణ పరీక్షలను వేగవంతం చేయాలని పేర్కొన్నారు. రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం కింద అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్నారు. సమావేశంలో అదనపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకట ప్రసాద్‌, వైద్యాధికారులు ప్రవీణ, అనిల్‌ కుమార్‌, గిరి, అనూష తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement