వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం

Aug 5 2026 12:24 AM | Updated on Aug 5 2026 12:24 AM

చిత్తూరు కలెక్టరేట్‌ : స్వయం సహాయక సంఘ సభ్యులను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా క్షేత్రస్థాయి సిబ్బంది కృషి చేయాలని డీఆర్‌డీఎ పీడీ శ్రీదేవి ఆదేశించారు. మంగళవారం చిత్తూరులోని డీఆర్‌డీఎ సమావేశ మందిరంలో ఏపీఎంలు ీసీసీలతో సమీక్షించారు. పీడీ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వయం సహాయక సంఘ సభ్యులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తున్నాయన్నారు. ప్రధానంగా వ్యవసాయేతర, పారిశ్రామిక రంగాలపై సంఘ సభ్యులు మక్కువ చూపే విధంగా సిబ్బంది అవగాహన కల్పించాలని కోరారు. బ్యాంకుల అనుసంధానం, మార్కెటింగ్‌, ఆర్థిక లావాదేవీల నిర్వహణపై దృష్టి పెడితేనే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చన్నారు. అలాగే చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటుపై అవగాహన ఉన్న సభ్యులను గుర్తించి వారికి సాయం అందించాలని సూచించారు. సంఘాల్లోని ఆర్థిక లావాదేవీల్లో ఎలాంటి తప్పిదాలు లేకుండా చూడాలని ఆదేశించారు. డీపీఎంలు సుబ్బారెడ్డి, మధు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement