– 11 కేజీల గంజాయి, 2 మోటార్ సైకిళ్లు, ఆరు సెల్ ఫోన్లు స్వాధీనం
పుత్తూరు: ఒడిశా నుంచి అక్రమంగా గంజాయిని తీసుకొచ్చి పుత్తూరు పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్న గంజాయి ముఠాలోని ఆరుగురుని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.1.67 లక్షల విలువైన 11 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ జి.రవికుమార్ తెలిపారు. డీఎస్పీ మీడియాకు వెల్లడించిన వివరాలు.. విశ్వసనీయ సమాచారంతో సీఐ నెట్టి కంఠయ్య, ఎస్‌ఐలు నాగేంద్రబాబు, వెంకటలక్ష్మి బృందం పుత్తూరు మండలం టీఆర్ కండ్రిగ చెరువు సమీపంలో ఆదివారం దాడులు నిర్వహించారు. ఈ దాడిలో అరెస్ట్ అయిన వారిలో టీఆర్‌కండ్రిగ కాలనీకి చెందిన కె.నవీన్‌కుమార్(36), గేట్‌పుత్తూరుకు చెందిన వి.జయప్రకాష్(25), ఎం.ఆర్.దేవరాజ్(24), సి.ఎస్.మూర్తి(24), గొల్లపల్లికి చెందిన బి.బాబునాయుడు(50), తాయిమాంబాపురానికి చెందిన రోహిత్(23) ఉన్నారు. వీరి వద్ద నుంచి గంజాయితో పాటు రెండు మోటార్ సైకిళ్లు, 6 సెల్ ఫోన్లను సైతం స్వాధీనం చేసుకున్నారు. టీఆర్‌కండ్రిగ కాలనీకే చెందిన మరో ఇద్దరు నిందితులు రాజేష్, శ్రీనివాసులు పరారీలో ఉన్నారు.


