నేడు తిరుమలలో పౌర్ణమి గరుడసేవ | - | Sakshi
Sakshi News home page

నేడు తిరుమలలో పౌర్ణమి గరుడసేవ

Jul 29 2026 12:46 AM | Updated on Jul 29 2026 12:46 AM

తిరుమల : తిరుమలలో బుధవారం పౌర్ణమి గరుడసేవ వైభవంగా నిర్వహించనున్నారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్పస్వామివారు బంగారు గరుడ వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు.

శ్రీవారి సేవను గ్రామస్థాయికి విస్తరిస్తాం

తిరుమల : శ్రీవారి సేవను గ్రామస్థాయిలో విస్తరించేందుకు టీటీడీ కార్యాచరణ చేపట్టిందని టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర తెలిపారు. తిరుమలలోని శ్రీవారి సేవా సదన్‌న్‌లో గ్రూప్‌ సూపర్‌వైజర్లకు నిర్వహిస్తున్న రెండో విడత శిక్షణ కార్యక్రమంలో మంగళవారం ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 50 వేల ఆలయాలు ఉన్నాయని, ఆయా దేవాలయాల్లో శ్రీవారి సేవ ద్వారా భక్తులకు సేవలందించే అవకాశాలను గుర్తించి టీటీడీ దృష్టికి తీసుకురావాలని వారికి సూచించారు. శ్రీవారి సేవకుల పనితీరును ఆధారంగా చేసుకుని సిబిల్‌ స్కోర్‌ తరహాలో రేటింగ్‌ వ్యవస్థను అమలు చేసే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఈవో వెల్లడించారు. ఆ రేటింగ్‌ ఆధారంగా విధుల కేటాయింపునకు చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.ఈ సందర్భంగా శిక్షణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ ఎస్‌.ఎల్‌.ఎన్‌.టి.శ్రీనివాస్‌, చైన్నెకి చెందిన శరత్‌ను ఈవో శాలువాతో సత్కరించారు. టీటీడీ సీపీఆర్వో డాక్టర్‌ టి.రవి, పీఆర్వో కుమారి నీలిమ, శ్రీవారి సేవా సదన్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement