సమస్యలకు సత్వర పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

సమస్యలకు సత్వర పరిష్కారం

Aug 4 2026 2:17 AM | Updated on Aug 4 2026 2:17 AM

చిత్తూరు అర్బన్‌ : ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం ప్రదర్శించకుండా సత్వరం పరిష్కరించాలని జిల్లా పోలీసు అధికారులను ఎస్పీ తుషార్‌ డూడి ఆదేశించారు. ఆయన సోమవారం చిత్తూరు నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 41 ఫిర్యాదులను స్వీకరించారు. నాన్‌ క్యాడ ర్‌ ఎస్పీ రాజశేఖర్‌ రాజు, అడిషనల్‌ ఎస్పీ ఎస్‌.షాను, డీఎస్పీ వెంకటనారాయణతో కలిసి బాధితు ల సమస్యలను విన్నారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఫిర్యాదును సమగ్రంగా పరిశీలించి త్వరితగతిన విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేయడమే పోలీసు శాఖ లక్ష్యమన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించాలన్న బాధ్యతతో పనిచేయాలని అధికారులకు సూచించారు. 41 ఫిర్యాదుల్లో భూ తగాదాలకు సంబంధించి 11, కుటుంబ తగాదాలకు 10, ఆస్తి తగాదాలకు 6, చీటింగ్‌కు 3, వేధింపులకు 3, డబ్బు తగాదాలకు 3, చిన్న గొడవలకు 2, బెదిరింపులకు 1, పోలీసు సేవలకు సంబంధించి 1, దారి సమస్యకు సంబంధించిన 1 ఫిర్యాదు ఉన్నట్టు అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement