రిజిస్ట్రేషన్లు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

రిజిస్ట్రేషన్లు ప్రారంభం

Aug 11 2026 2:06 AM | Updated on Aug 11 2026 2:06 AM

చిత్తూరు కలెక్టరేట్‌ : విద్యార్థుల్లో పరిశోధనలపై ఆసక్తి పెంచేందుకు అనేక ప్రత్యేక కార్యక్రమాలు అమలవుతున్నాయి. అందులో భాగంగానే ఏటా జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ పేరిట విద్యార్థుల్లో విజ్ఞాన ప్రతిభను వెలికితీస్తున్నారు. ఈ ఏడాది జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహించే ‘32వ జాతీయ బాలల సైన్‌న్స్‌ కాంగ్రెస్‌–2026’లో పాల్గొనేందుకు దరఖాస్తులు చేసుకోవాలని ఇటీవల ఏపీ రాష్ట్ర కౌన్సిల్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగం నోటిఫికేషనన్‌ విడుదల చేసింది.

15వ తేదీ లోగా రిజిస్ట్రేషన్‌న్‌ చేసుకోవాలి

‘సుస్థిరత కోసం సైన్‌న్స్‌ ఆవిష్కరణలు’ అనే అంశంపై నిర్వహించే ‘32వ జాతీయ బాలల సైన్‌న్స్‌ కాంగ్రెస్‌–2026’లో పాల్గొనే విద్యార్థులు తమ ప్రాజెక్టులను ఈ నెల 15వ తేదీలోగా రిజిస్ట్రేషన్‌న్‌ చేసుకోవాలి. వ్యర్థాల నిర్వహణ, శక్తి–అన్వేషణ, వర్షపు నీటి సంరక్షణ, ఆహారం–వ్యవసాయం, స్థిరమైన అభివృద్ధి–సంప్రదాయ జ్ఞాన వ్యవస్థలు అనే ఐదు అంశాలపై సమస్యలను గుర్తించి సమాజానికి ఉపయోగపడేలా పరిష్కారం చూపిస్తూ ప్రాజెక్టులు తయారు చేయాలి.

అర్హులు వీరే

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో 6 నుంచి 10వ తరగతి, ఇంటర్‌ చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. జిల్లా స్థాయి పోటీలు అక్టోబరు, నవంబరులో జరుగుతాయి. డిసెంబర్‌లో రాష్ట్ర స్థాయి, వచ్చే ఏడాది జనవరిలో జాతీయ స్థాయి పోటీలు నిర్వహిస్తారు. విజేతలకు రాష్ట్రపతి చేతుల మీదగా పురస్కారాలు ఇస్తారు. విద్యార్థులు www. ncrc.in వెబ్‌సైట్లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి.

ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి

జిల్లాలోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా మారేందుకు ఇది చక్కని అవకాశం. ప్రతిభావంతులైన విద్యార్థులను ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి. చిన్న పరిశోధన గొప్ప ఆవిష్కరణ కావొచ్చు. – లక్ష్మీనారాయణ, డీఈవో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement