నగిరి మండలం పార్కిన్స్ టెక్స్‌టైల్స్ మాజీ కార్మికులు తమకు జరిగిన అన్యాయంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. 2006లో మూతబడిన కంపెనీ సెటిల్‌మెంట్ విషయంలో 272 మంది కార్మికులకు మొండిచేయి చూపిందన్నారు. 272 మంది కార్మికులకు కంపెనీ సెటిల్‌మెంట్ చేసిందన్నారు. మిగిలిన 26 మంది కార్మికులను ఇబ్బంది పెడుతోందన్నారు. కొందరు వ్యక్తులు తప్పుడు సమాచారంతో సర్వే నెంబర్ 242/1లో 1.98 ఎకరాలు ఫ్యాక్టరీ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని వివరించారు. కోర్టులో కేసు ఉండగానే జరిగిన ఈ అక్రమ రిజిస్ట్రేషన్లను నిలిపివేసి తమకు న్యాయం చేయాలని కోరారు.


