చిత్తూరు కలెక్టరేట్ : కలెక్టరేట్‌లో సోమవారం నిర్వ హించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమానికి అర్జీదారులు క్యూ కట్టారు. ఆలకించి దయచూపండయ్యా అంటూ పలువురు తమ గోడును కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ, జేసీ ఆదర్శ్ రాజేంద్రన్‌లకు విన్నవించుకున్నారు. అందిన అర్జీలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి విచారణ చేసి తక్షణ చర్యలు చేపట్టాలని కలె క్టర్, జేసీ పలు శాఖల అధికారులను ఆదేశించారు.
అవినీతిపై మహిళల ధ్వజం
పలమనేరు నియోజకవర్గం, గంగవరం మండలం, గుండుగల్లు గ్రామానికి చెందిన అనిత, ప్రేమ, పుష్పవతి తదితర మహిళా సంఘాల సభ్యులు కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. తమ గ్రామంలోని 45 మహిళా ఎస్‌హెచ్‌జీ సంఘాలకు గత ఏడాదిగా శాశ్వత సంఘమిత్ర లేరని తెలిపారు. ప్రస్తుతం తాత్కాలికంగా ఉన్న సంఘమిత్ర అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. దీనిపై స్పందించిన కలెక్టర్ నివేదిక ఇవ్వాలని డీఆర్‌డీఏ పీడీని ఆదేశించారు.


