హ్యాండ్‌బాల్‌ విజేతలుగా చిత్తూరు, పశ్చిమగోదావరి | - | Sakshi
Sakshi News home page

హ్యాండ్‌బాల్‌ విజేతలుగా చిత్తూరు, పశ్చిమగోదావరి

May 11 2026 8:32 AM | Updated on May 11 2026 8:32 AM

కదిరి అర్బన్‌: పట్టణంలోని ఎస్టీఎస్‌ఎన్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న 48వ రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్‌ జూనియర్‌ బాలికలు, బాలుర చాంపియన్‌షిప్‌ పోటీల్లో బాలికల విభాగంలో పశ్చిమ గోదావరి, బాలుర విభాగంలో చిత్తూరు జట్లు విజేతలుగా నిలిచాయి. బాలికల విభాగంలో ద్వితీయ స్థానంలో శ్రీసత్యసాయి జిల్లా, తృతీయ స్థానంలో విజయనగరం జిల్లా జట్టు నిలిచాయి. బాలుర విభాగంలో ద్వితీయ స్థానంలో శ్రీసత్యసాయి జిల్లా, తృతీయ స్థానంలో విజయనగరం జట్లు సాధించాయి. గెలుపొందిన జట్లకు చాంపియన్‌ ట్రోఫీని బహూకరించారు.

గంగజాతరకు పటిష్ట భద్రత

తిరుపతి క్రైం : తిరుపతి గంగమ్మ జాతరకు పటిష్ట భద్రత కల్పిస్తున్నట్టు తిరుపతి డీఎస్పీ భక్తవత్సలం నాయుడు తెలిపారు. జాతర ప్రాంగణంలో జేబుదొంగలు, గొలుసు దొంగలు సంచరించే అవకాశాలు ఉన్నందున భక్తులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళలు బంగారు ఆభరణాలు అధికంగా ధరించి రావద్దని, విలువైన వస్తువులను ఎల్లప్పుడూ తమ కంటికి కనిపించేలా జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించారు. పిల్లలు తప్పిపోయిన సందర్భాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ను సంప్రదించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 100 లేదా 112 నంబర్లకు కాల్‌ చేయాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement