చిత్తూరు రూరల్ (కాణిపాకం): అంతర్జాతీయ ఎయిడ్స్ క్యాండిల్ లైట్ మెమోరియల్ డేను పురస్కరించుకుని చిత్తూరు నగరంలో ఆదివారం సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఈ ర్యాలీని నేషనల్ ఎయి డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో నిర్వహించారు. ర్యాలీ జిల్లా ఎయిడ్స్ నివారణ కేంద్రం నుంచి ప్రారంభమై చర్చ్ స్ట్రీట్, మార్కెట్ చౌక్ మీదుగా గాంధీ సర్కిల్ వరకు సాగింది. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ నాగశశిభూషణ్‌రెడ్డి, జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టీబీ అధికారి డాక్టర్ జి.వెంకట ప్రసాద్, దిశా సీపీఎం కోటి రెడ్డి, ఐసీటీసీ సిబ్బంది, ఎన్జీవో ప్రతినిధులు, నర్సింగ్ విద్యార్థులు, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.
స్వల్పంగా
పెరిగిన టమాట ధరలు
వి.కోట: వి.కోట మార్కెట్‌లో ఆదివారం టమాట ధరలు స్వల్పంగా పెరిగాయి. 18 కిలోల బాక్సు ధర రూ.250 నుంచి రూ.500 పలికింది. రైతులు మూడు రోజులుగా 18 కిలోల బాక్సు ధర అత్యధికంగా రూ.400 నుంచి 500 వరకు పలుకుతోంది. ప్రస్తుతం పంట తక్కువగా ఉందని, మార్కెట్‌కు టమాట కాయలు తక్కువగా వస్తుండడంతోనే ధరలు పెరుగుతున్నట్టు మండీ వ్యాపారులు చెబుతున్నారు.


