కలెక్టర్ సుమిత్‌కుమార్ అధికార దర్పాన్ని పక్కనబెట్టారు. తనలో ఉన్న దయార్థహృదయాన్ని బయటకు తీశారు. ఉలుకూపలుకు లేకుండా ఓ చింత చెట్టు వద్ద పడి ఉన్న వృద్ధురాలిని అక్కున చేర్చుకున్నారు. ఆస్పత్రిలో చేర్పించి మానవత్వాన్ని చాటిచెప్పారు. వివరాలు.. చిత్తూరు నగరంలోని గంగనపల్లె కూడలిలో ఉన్న చింతచెట్టు వద్ద ఓ అవ్వ దీనస్థితిలో పడి ఉండడాన్ని కొందరు ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. స్పందించిన కలెక్టర్ సుమిత్‌కుమార్ ఆమెను ఆస్పత్రిలో చేర్పించాలని గురువారం అధికారులను ఆదేశించారు. అవ్వ బాగోగులు చూసుకోవాలని మెప్మా అధికారులను ఆదేశించారు. దీంతో వృద్ధురాలిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, వైద్య సేవలందిస్తున్నారు.
– చిత్తూరు అర్బన్


