జాతరలో ఓంశక్తి భక్తుల వినూత్న ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా నిలిచింది. 40 రోజులపాటు దీక్షలు చేపట్టిన భక్తులు ముందుగా శ్రీ అగస్తీశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శూలాలతో విన్యాసాలు చేశారు. కొంతమంది భక్తులు నోటికి శూలాలు గుచ్చుకోగా, మరికొందరు వీపుకు కొక్కీలు వేయించున్నారు. ఇంకొందరు శరీరమంతా నిమ్మకాయలు గుచ్చుకుని భక్తి భావం చాటుకున్నారు. ఓంశక్తి భక్తుల విన్యాసాలు ఒళ్లుగగుర్పొడిచేలా దర్శనమిచ్చాయి. ఓ భక్తుడు క్రేన్‌న్ సహాయంతో లారీలో వేలాడుతూ గంగమ్మకు గజమాల సమర్పించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
చిన్నారితో కలిసి ఓంశక్తి భక్తుడి విన్యాసం


