శ్రీవారి దర్శనానికి 24 గంటలు | - | Sakshi
Sakshi News home page

శ్రీవారి దర్శనానికి 24 గంటలు

May 16 2026 3:07 AM | Updated on May 16 2026 3:07 AM

తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్‌ శిలాతోరణం వద్దకు చేరుకుంది. గురువారం అర్ధరాత్రి వరకు 67,722 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 36,705 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.45 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది.

జూన్‌ 5న ఎస్వీయూ స్నాతకోత్సవం

తిరుపతి సిటీ: శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ 63 నుంచి 68వ స్నాతకోత్సవాలను వచ్చే నెల 5వ తేదీన నిర్వహించనున్నారు. కాగా ఇప్పటి వరకు కాన్వొకేషన్‌కు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు ఈనెల 18వ తేదీలోపు ఇన్‌అడ్వాన్స్‌డ్‌ డిగ్రీకి దరఖాస్తు చేసుకోవాలని కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ డాక్టర్‌ రాజామాణిక్యం ఒక ప్రకటనలో తెలిపారు. గడువు పూర్తి అయిన తర్వాత వచ్చిన దరఖాస్తులు స్వీకరించకూడదని పరీక్ష విభాగాధికారులకు ఆయన సూచించారు.

ఈఎస్‌ఐలో తనిఖీలు

తిరుపతి తుడా: స్థానిక ఆర్సీ రోడ్డులోని ఈఎస్‌ఐ ఆస్పత్రిని ఇన్సూరెనన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ శాఖ రాయలసీమ రీజియన్‌ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జి పద్మజ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం ఆమె డాక్టర్లతో మాట్లాడుతూ డిస్పెన్సరీల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు డిస్పెన్సరీలకు వచ్చే అవుట్‌ పేషెంట్ల సంఖ్యను పెంచేందుకు డాక్టర్లు, వైద్య సిబ్బంది కృషి చేయాలని సూచించారు. ఈఎస్‌ఐ వైద్య సేవలను లబ్ధిదారులకు చేరువచేసేందుకు సంస్థలు పనిచేసే ప్రాంతాల్లో వైద్య శిబిరాలు పెట్టాలని చెప్పారు. అనంతరం సిబ్బంది హాజరు, ఫార్మసీ రిజిస్టర్లను, ఆస్పత్రి రికార్డులను పరిశీలించారు.

Advertisement
 
Advertisement
Advertisement