వేతనాల వెం‘బడి’! | - | Sakshi
Sakshi News home page

వేతనాల వెం‘బడి’!

May 8 2026 11:08 AM | Updated on May 8 2026 11:08 AM

● జిల్లాలోని ఎయిడెడ్‌ పాఠశాలల్లో విచిత్ర పరిస్థితి ● విధులు లేకపోయినా వేతనాలు ఫుల్‌ ● లోపాలపై అధికారుల స్పందన కరువు

చిత్తూరు కలెక్టరేట్‌: జిల్లాలోని ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. పనిలేని చోట జీతాలు.. పిల్లలు లేని చోట టీచర్లు అన్నట్టు తయారయ్యాయి. లోపాలను గుర్తించినా, నివేదికలు సిద్ధంగా ఉన్నా చర్యలు తీసుకోవడంలో ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కించడం వెనుక మతలబు ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ఖాళీ బెంచీలకు పాఠాలు

విద్యార్థులే లోని చోట సైతం టీచర్లు యథేచ్ఛగా కొనసాగుతున్నారు. కొన్ని చోట్ల విద్యార్థులకంటే టీచర్లే ఎక్కువగా ఉన్నారు. మరికొన్ని చోట్ల కనీసం విద్యార్థి, టీచర్ల నిష్పత్తి లేకపోయినప్పటికీ అదనంగా మరికొందరు టీచర్లు తిష్టవేసి ప్రతి నెలా జీతాలు తీసుకుంటున్నారు. ఇది కేవలం బాధ్యతా రాహిత్యమే కాదు, అక్షరాలా ప్రజాధనాన్ని దోచిపెట్టడమేనని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు.

లోపాల నివేదికలు బుట్టదాఖలు

ఎయిడెడ్‌ పాఠశాలల్లోని లోపాల నివేదికలను విద్యాశాఖ అధికారులు బుట్టదాఖలు చేస్తున్నా రు. అక్రమాలను అరికట్టే బాధ్యతను ఆర్జేడీ, ప్రా థమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు సంబంధించి జిల్లా విద్యాశాఖ అధికారులకు అప్పగించినా క్షేత్ర స్థాయిలో మార్పు మాత్రం శూన్యమే.

ప్రక్షాళన ఎప్పుడో?

ఎయిడెడ్‌ పాఠశాలల్లో నిధులు వృథా అవుతున్నా యి. ఒక వైపు ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొర త వేధిస్తుంటే, మరోవైపు ఎయిడెడ్‌ విద్యాసంస్థ ల్లో పని లేకుండానే వేతనాలు చెల్లించడం ఎంత వరకు సమంజసం అని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. వెంటనే జిల్లా వ్యాప్తంగా ఎయిడెడ్‌ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యపై క్షేత్ర స్థాయి విచారణ చేపట్టాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

లేని పిల్లలను ఉన్నట్టు చూపించి..!

కొన్ని ఎయిడెడ్‌ యాజమాన్యాలు లేని విద్యార్థుల ను ఉన్నట్లు చూపించి పోస్టులను కొనసాగిస్తూ చాన్నాళ్లుగా లబ్ధిపొందుతున్నాయి. ఇటీవల కాలంలో ప్రభుత్వం యూడైస్‌ లెక్కలను పక్కా గా నిర్వహిస్తోంది. ఆధార్‌ నంబర్‌ ప్రకారం విద్యార్థి పేరు ఒక పాఠశాలలోనే ఉండాలి. జిల్లా కేంద్రంలోని కొంగారెడ్డిపల్లిలో ఉన్న ఎయిడెడ్‌ పాఠశాలలో తక్కువ మంది విద్యార్థులున్నప్పటి కీ తప్పుడు నివేదికలు అమలు చేస్తున్నట్లు సమాచారం. జిల్లాలో ఆ యాజమాన్యాలతో లోపాయికారీ అవగాహన చేసుకుని.. కోర్టుపరమైన సాకులను బూచీగా చూపుతూ పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement