చిత్తూరు రూరల్(కాణిపాకం): చిత్తూరు నగరంలోని గీతామందిరంలో ఆదివారం నడివీధి గంగమ్మ అలంకరణ ఆభరణాలను జాతర వంశపారంపర్య ధర్మకర్త, మాజీ ఎమ్మెల్యే సీ.కే.బాబు ప్రదర్శించారు. సీకే బాబు దంపతులు రూ.3.60 లక్షలు విలువ చేసే బంగారు బొట్టు గుండ్లను తయారీ చేయించారు. అలాగే సీఆర్‌సీ రవి రూ.50 వేలు విలువ చేసే ఫ్యాన్సీ జ్యువెలరీ, చంద్రశేఖర్‌నాయుడు, సతీష్ రూ.1.20 లక్షలతో మైక్రో గోల్డ్ ప్లేటింగ్ చీర, ప్రముఖ వ్యాపారవేత్త వేమారెడ్డి కుటుంబ సభ్యులు రూ.1.50 లక్షల విలువ చేసే బంగారు గుండ్లు బహూకరించారు. అనంతరం జాతర ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంగళ, బుధవారాల్లో అత్యంత వైభవోపేతంగా జరిగే నడివీధి గంగమ్మ జాతర వేడుకల్లో ప్రజలు ఉత్సహంగా పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో సభ్యులు సీకే లావణ్య, వెంకటేష్, గుణ పాల్గొన్నారు.


