చిత్తూరు కార్పొరేషన్: పెట్రోల్, డీజల్ ధరల పెంపునకు నిరసనగా సోమవా రం వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వ హించనున్నట్లు ఆ పార్టీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి తెలిపారు. ఉదయం 9.30 గంటలకు గాంధీ విగ్రహం వద్దకు అన్ని విభాగాల నాయకులు చేరుకోవాలని కోరారు. అక్క డి నుంచి ర్యాలీగా బయలుదేరి ఆర్డీవో కార్యా లయానికి చేరుకుంటామ ని తెలిపారు. అక్కడ నిరసన తెలిపి ఆర్డీవోకు వినతి పత్రం అందజేస్తామని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
నేడు డయల్ యువర్ ఎస్‌ఈ
చిత్తూరు కార్పొరేషన్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం డయల్ యువర్ ఎస్‌ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ట్రాన్స్‌కో ఎస్‌ఈ అమర్‌బాబు తెలిపారు. వినియోగదారులు ఉదయం 8.30–9.30 గంటల మధ్య 7993147979 నంబర్‌కు ఫోన్ చేసి తమ సమస్యలు తెలియజేయాలని సూచించారు.
నేడు కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్
చిత్తూరు కలెక్టరేట్ : ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్ (ప్రజా సమస్యల పరిష్కార వేదిక) నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు. గైర్హాజరయ్యే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


