ఉచిత భోజనంలో ఉప్పు.. కారం లేదు | - | Sakshi
Sakshi News home page

ఉచిత భోజనంలో ఉప్పు.. కారం లేదు

May 17 2026 12:24 AM | Updated on May 17 2026 12:24 AM

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): ఉచిత భోజనంలో ఉప్పు, కారం లేదు. ఇడ్లీ లు రాళ్లులా ఉంటున్నాయి. రసం, సాంబారు, మజ్జిగ నీళ్లలా పల్చగా ఉన్నాయి. అన్నం ఉడకడం లేదు. వీటిని ఎలా తినాలని రోగులు, వారి సహాయకులు ఆవేదన వ్యక్తం చేశా రు. ఎమ్మెల్యే గురజాల జగన్‌మోమన్‌ శుక్రవారం రాత్రి చిత్తూరు నగరంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో తనిఖీ చేశారు. చిన్న పిల్లల వార్డు చికిత్స పొందుతున్న చిన్నారులు, రోగులతో మాట్లాడారు. భోజనం సరిగా లేదని పలువురు రోగులు ఎమ్మెల్యే ముందు వాపోయారు. ఇడ్లీలు రాళ్ల లాగా ఉండడంతో తినలేక పోతున్నామని తెలిపారు. డబ్బులిచ్చి బయట తెచ్చుకుంటున్నామని, పూటకు రూ.100 నుంచి రూ.200 వరకు ఖర్చవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగులకు నాణ్యమైన భోజనం పెట్టాలని ఆదేశించారు. ఎవడైతే ఏముంది, ఇంత దారుణంగా ఆహారం అందిస్తారా? కలెక్టర్‌కు చెప్పి కాంట్రాక్టు రద్దు చేయిస్తా, మంచి కాంట్రాక్టర్‌ను తీసుకొస్తానంటూ పేర్కొన్నారు.

రూ.10 లక్షల కుచ్చుటోపి ?

సాక్షి టాస్క్‌ ఫోర్స్‌ : జీడీనెల్లూరు మండలానికి చెందిన కొందరు వ్యక్తులు తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులకు రూ.10 లక్షల కుచ్చుటోపి పెట్టారు. ఈ సంఘటన ఆలస్యంగా శనివారం వెలుగులోకి వచ్చింది. తమిళనాడు రాష్ట్రం క్రిష్ణగిరికి చెందిన ఇద్దరు వ్యక్తులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారు మాట్లాడుతూ తాము టెంకాయల వ్యాపారం కోసం చిత్తూరు జిల్లాకు వచ్చామని తెలిపారు. గంగాధర నెల్లూరు మండలానికి చెందిన ఐదుగురు తమను మోసం చేసి రూ.10 లక్షల దోచుకున్నారని తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు జీడీనెల్లూరు మండలానికి చెందిన ముగ్గురిని, పోలీసు శాఖకు చెందిన ఇద్దరిని చిత్తూరులో విచారిస్తున్నట్టు సమాచారం. ఈ విషయంపై జీడీ నెల్లూరు ఎస్‌ఐని వివరణ కోరగా పూర్వాపరాలు విచారించి ఆదివారం తెలియజేస్తామన్నారు. ఈ తతంగమంతా దొంగ నోట్ల ముఠా దొంగనోట్ల మార్పిడి కోసమేనని ప్రచారం జరుగుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement