పలమనేరు మాజీ సీఐ నరసింహరాజుకు తీవ్రగాయాలు | - | Sakshi
Sakshi News home page

పలమనేరు మాజీ సీఐ నరసింహరాజుకు తీవ్రగాయాలు

May 10 2026 7:52 AM | Updated on May 10 2026 7:52 AM

పలమనేరు: కడపలోని అల్మాస్‌పేట సర్కిల్‌లో శనివారం ఇరువర్గాల మధ్య అల్లర్లు జరిగాయి. ఇందులో గతంలో పలమనేరులో సీఐగా పనిచేసి బదిలీపై కడప తాలూకా స్టేషన్‌కు వెళ్లిన నరసింహరాజుకు తీవ్రగాయాలైనట్టు తెలిసింది. ఆయనను సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.

ఘనంగా కియా సిరోస్‌ 2026 ఆవిష్కరణ

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): కియా ఇండియా సంస్థకు చెందిన నూతన కియా సిరోస్‌ 2026 కారును శనివారం చిత్తూరు నగరం ఇరువారంలోని హోషి ఆటో ప్రైవేట్‌ లిమిటెడ్‌ కియా షోరూంలో ఘనంగా ఆవిష్కరించారు. షో రూం మేనేజింగ్‌ డైరెక్టర్‌ సి.జగన్నాథ రెడ్డి మాట్లాడుతూ కియా నుంచి విడుదలైన సిరోస్‌ 2026 మోడల్‌ కారు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, భద్రతా ప్రమాణాలతో రూపొందించబడిందన్నారు. వినియోగదారుల సౌకర్యా న్ని దృష్టిలో పెట్టుకుని పలు నూతన ఫీచర్లను తీసుకువచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్లు చెరకు నిరంజన్‌, సి.భారతి, సి.హోషిమారెడ్డి, సి.ఆశిష్‌ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement