శాశ్వత ఉద్యోగులుగా గుర్తించండి | - | Sakshi
Sakshi News home page

శాశ్వత ఉద్యోగులుగా గుర్తించండి

May 12 2026 5:42 AM | Updated on May 12 2026 5:42 AM

చిత్తూరు కార్పొరేషన్‌: విద్యుత్‌ సంస్థలో కొనసాగుతున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని, మూడో పార్టీ విధానాన్ని రద్దు చేయాలని ఏఈసీఈఎ జీ–3045 సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. జిల్లా ట్రాన్స్‌కో ఎస్‌ఈ కార్యాలయం వద్ద సోమవారం సోషల్‌మీడియా ఉద్యమం నిరసనలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర నాయకులు రూప్‌కుమార్‌, హేమకుమార్‌ మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సోషల్‌ మీడియా ఉద్యమం ప్రారంభమైందన్నారు. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, మంత్రి నారాలోకేష్‌కు తమ సమస్యలను పంపించామని చెప్పారు. రెండు దశాబ్దాలుగా చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సలహాదారుడు నిరంజన్‌కుమార్‌, జిల్లా అధ్యక్షులు మనిష్‌కుమార్‌, డివిజన్‌ కార్యదర్శులు బాలాజీ, రవి, చిరంజీవి, మధుసూదన్‌, వినయ్‌కుమార్‌, పాండు, రవీంద్రబాబు, గిరిబాబు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement