వేసవిలో దొంగల హల్‌చల్
జాగ్రత్తలు పాటిద్దాం
పలమనేరు: వేసవిలో ఎంజాయ్ చేయడానికి చాలా మంది ఊర్లకు వెళుతున్నారు. ఇదే అదునుగా దొంగలు హల్‌చల్ చేస్తున్నారు. ముందుగా రెక్కీ నిర్వహించి ఆపై తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ చేస్తున్నారు. ఆపై అదును చూసి తాళాలు పగులగొట్టి చోరీలకు తెగబడుతున్నారు. ఎక్కడికై నా బయటళి వెళ్లేవారు సంబంధిత స్టేషన్ పరిధిలో సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు.
అనుమానం రాకుండా..
పాత ఇనుము కొంటామని, స్టౌలు రిపేరు చేస్తామని, మంచాలు రెడీ చేస్తామంటూ రకరకాల వ్యాపారాల పేరిట కొందరు వీధుల్లో పగటిపూట సంచరిస్తారు. రెండుమూడు రోజులు తాళం ఉన్న ఇళ్లను పక్కాగా స్కెచ్ వేసుకుని చోరీలకు పాల్పడుతుంటారు. కొందరు మహిళలు పగటిపూట యాచిస్తూ కూడా ఏయే ఇళ్లకు తాళాలున్నాయో చూసుకెళ్లి మగవారికి చెప్పడం.. ఆపై రాత్రుల్లో చోరీలు జరగడం సర్వసాధారణమైపోతోంది.
ఇటీవల జరిగిన చోరీలు..
పట్టణ సమీపంలోని సాయినగర్ వద్ద ఓ ఉద్యోగి తన కుటుంబంతోపాటు కాకినాడకు వెళ్లాడు. ఇంటికి లాక్ ఉందని ముందుగా తెలుసుకున్న దొంగలు అర్ధరాత్రి పూట ఇంట్లోకి ప్రవేశించి చోరీకి తెగబడ్డారు. ఈ చోరీలో పెద్ద మొత్తమే పోయినట్టు తెలిసింది. ఆపై సీసీ కెమరాల్లో సైతం ముసుగు కప్పుకున్న దొంగల పుటేజీ కనిపించింది. తాజాగా మండల కేంద్రమైన బైరెడ్డిపల్లిలోనూ డోర్‌లాక్ చేసిన ఇంట్లో చోరీ జరిగింది. పక్కపక్కనే మూడు ఇళ్ల వారు ఊర్లకు వెళ్లారు. ఆ మూడు ఇళ్ల లాక్‌లు ముందుగా పసిగట్టిన దొంగలు ఓ ఇంట్లో చోరీ చేస్తుండగా వీధికుక్కల గుంపు అరవడంతో అక్కడి నుంచి పరారయ్యారు.


