చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న కిశోరి వికాసం కార్యక్రమానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు విడుదల కాలేదని ఐసీడీఎస్ పీడీ వెంకటేశ్వరి స్పష్టం చేశారు. ఈ నెల 6న సాక్షి దినపత్రికలో ‘కిశోరి వికాసం ఎక్కడ?’ శీర్షికతో వార్త ప్రచురితమైంది. దీనిపై ఐసీడీఎస్ పీడీ స్పందించారు. సమ్మర్ క్యాలెండర్, కలెక్టర్ ఆదేశాల ప్రకారం గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో బాలికలకు కిశోరి వికాసం అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యకమం నిర్వహణలో ఎవరైన అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని పీడీ హెచ్చరించారు.
జనగణనలో
నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా సాగుతున్న జనగణన ప్రక్రి యలో నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదని డీఆర్‌వో మోహన్‌కుమార్ హెచ్చరించారు. గురువారం క్షేత్ర స్థాయి అధికారులతో కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. జిల్లాలో జరుగుతు న్న జనగణన కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతతో, సమర్థవంతంగా నిర్వహించాలన్నా రు. జనగణన అత్యంత కీలకమైన కార్యక్రమమని చెప్పారు. భవిష్యత్తు ప్రణాళికల రూపకల్పనలో ఈ సమాచారం కీలకమని తెలిపారు. జనగణనకు కేటాయించిన సిబ్బంది పూర్తి స్థాయిలో ఈ విధుల్లోనే నిమగ్నం కావాలని స్పష్టం చేశారు. శిక్షణ పొందిన ఎన్యూమరేటర్లు ఇంకా సందేహాలు వ్యక్తం చేయడం, క్షేత్ర స్థాయిలో తప్పుడు సమాచారం సేకరించడం వంటి చర్యలకు పాల్పడితే వారిని తక్షణమే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. జిల్లాలో మొత్తం 2,712 మంది ఎన్యూమరేటర్లు క్షేత్ర స్థాయిలో పనిచేయాలన్నారు. శాంతిపురం వంటి మండలాల్లో పనులు మందగించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.


