గంగాధరనెల్లూరు: నమ్మకానికి, దృఢత్వానికి ప్రతీకగా భారతి ఆల్ట్రా ఫాస్ట్ సిమెంట్ నిలుస్తుందని ఆ సంస్థ టెక్నికల్ మేనేజర్ సి.చాయాపతి తెలిపారు. గురువారం గంగాధరనెల్లూరు మండల కేంద్రంలోని భారతి సిమెంట్, శ్రీ బాలాజీ స్టీల్ అండ్ సిమెంట్ ఆధ్వర్యంలో తాపీ మేసీ్త్రలకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భారతి సిమెంట్ టెక్నికల్ మేనేజర్ చాయాపతి మాట్లాడుతూ జర్మనీ టెక్నాలజీ రోబోటిక్ క్వాలిటీ కంట్రోల్ ఇంజినీరింగ్ నిపుణుల పరివేక్షణలో అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో భారతి ఆల్ట్రా ఫాస్ట్ సిమెంటును ఉత్పత్తి చేస్తున్నట్లు వెల్లడించారు. టెంపర్ ప్రూఫ్ బస్తాలతో మార్కెట్లోకి వస్తుండడంతో తూకం తగ్గే అవకాశం ఉండదన్నారు. సిమెంట్ రంగంలో భారతి సిమెంట్ అగ్రగామిగా నిలిచిందని తెలిపారు. అనంతరం భారతి సిమెంట్‌కు సంబంధించిన నాణ్యత ప్రమాణాలు, విశిష్టత తదితర అంశాల పై అవగాహన కల్పించారు.భారతి ఆల్ట్రా ఫస్ట్ సిమెంట్ తయారవుతున్న విధానం, భవన నిర్మాణ కార్మికులు పాటించాల్సిన జాగ్రత్తలను వివరించారు. వినియోగదారుల సౌలభ్యం కోసం భారతి సిమెంట్ అన్నిచోట్ల అందుబాటులో ఉండేలా డీలర్లను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. తాపీ మేసీ్త్రలకు ప్రమాద బీమా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ బాలాజీ స్టీల్ అండ్ సిమెంట్ యజమాని ఎల్ రాజారత్నం నాయుడు, సేల్స్ ఆఫీసర్ అనిల్‌కుమార్‌రెడ్డి, భారతి సిమెంట్ ప్రతినిధులు, తాపీ మేసీ్త్రలు పాల్గొన్నారు.


