– 8లో
శ్రీనివాసమంగాపురంలో వెలసిన కల్యాణ వెంకన్న స్వర్ణరథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.
నిండు ప్రాణం బలి
కార్వేటినగరం మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన దేవకి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు శివరాత్రి సందర్భంగా తలకోనకు వెళ్లి తిరిగి వస్తున్నారు. తురకమిట్ట సమీపంలో వారు ప్రయాణిస్తున్న వాహనం బోల్తా పడింది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారికి చికిత్స అందించేందుకు 108 వాహనానికి సమాచారం ఇచ్చాం. గంట అయినా 108 వాహనం రాలేదు. తీవ్రంగా గాయపడిన దేవకి ప్రాణాలు కోల్పోయింది. ఇలాంటి విషయాలను అధికారులు గుర్తించాలి.
– బండి రాము,
లక్ష్మీపురం, కార్వేటినగరం మండలం
గర్భిణిని ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్లాం
మూడు నెలల క్రితం గర్భిణి నొప్పులతో బాధపడుతుండగా 108కు కాల్ చేశాను. వారు నిండ్ర హాస్పిటల్ నుంచి పది నిమిషాల్లో చేరుకుంటామన్నారు. గంట సమయం దాటినా రాలేదు. నొప్పులు ఎక్కువగా ఉండడంతో ఆటోలో నగిరి ఏరియా ఆస్పత్రికి బయలుదేరాం. నగరి మండలం వేలావడి వద్ద వెళుతుండగా 108 వారు కాల్ చేసి పన్నూరు సబ్‌స్టేషన్ వద్దకు వచ్చామన్నారు. మేము ఆస్పత్రి సమీపంలో వెళుతున్నామని చెబితే టైం పాస్ కోసం 108కు ఫోన్ చేశారా అంటూ నాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలస్యమైందని వచ్చేశామంటే గొడవకు దిగారు. నాతో ఉన్న వారు ఎందుకు అలా అంటున్నారంటే ఎవరికైనా కంప్లయింట్ చేసుకోండి మాకేమీ భయం లేదు అని మాట్లాడారు. గతంలో ఇలాంటి పరిస్థితి లేదు.
– జికె శివ, అత్తూరు, నిండ్ర మండలం


