చిత్తూరు కలెక్టరేట్ : ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం చిత్తూరు కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తామని వెల్లడించారు. సమావేశానికి అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని, గైర్హాజరయ్యే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నేడు డయల్ యువర్ ఎస్‌ఈ
చిత్తూరు కార్పొరేషన్ : విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం డయల్ యువర్ ఎస్‌ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ట్రాన్స్‌కో ఎస్‌ఈ అమర్‌బాబు తెలిపారు. వినియోగదారులు తమ సమస్యలపై ఉదయం 8.30 నుంచి 9.30 గంటల మధ్య 7993147979 నంబర్‌కు ఫోన్ చేయాలని వివరించారు.
నేడు పోలీసు
కార్యాలయంలో గ్రీవెన్స్‌డే
చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరంలోని వన్‌టౌన్ పక్కన ఉన్న ఆర్ముడు రిజర్వు (ఏఆర్) కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (గ్రీవెన్స్‌డే) కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్పీ తుషార్ డూడీ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు నేరుగా తనను కలిసి సమస్యలు తెలియజేయవచ్చని వెల్లడించారు. ఉదయం 10.30 గంటల నుంచి ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తామని పేర్కొన్నారు.
విజయ్ అభిమానుల సంబరాలు
నగరి: తమిళనాడు ముఖ్యమంత్రిగా సినీనటుడు, తమిళగ వెట్రికళగం (టీవీకే) పార్టీ వ్యవస్థాపకుడు సి.జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేయ డంతో నగరిలోని ఆయన అభిమానులు ఆదివారం సంబరాలు చేసుకున్నారు. సత్రవాడ, కేవీపీఆర్‌పేట, ఏకాంబరకుప్పం, పుదుపేట ప్రాంతాల్లో ప్రమాణ స్వీకారాన్ని టీవీలో వీక్షిస్తూ టపాకాయలు పేల్చారు. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. టీవీకే పార్టీ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుడు ఎంకే శేఖర్ మాట్లాడుతూ తమిళనాడులో విజయ్ సర్కార్ ప్రారంభమైందని, ప్రజల ఆశయాలను నెరవేర్చే నాయకుడిగా విజయ్ ఎదుగుతాడని విశ్వాసం వ్యక్తం చేశారు. అభిమానుల ఉత్సాహం నగరిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో ఆంధ్ర రాష్ట్ర యువత అధ్యక్షుడు మొహమ్మద్ సఖీ, అభిమాన సంఘం నేతలు సెల్వన్, రాజ, సంజీవి, ఏలుమలై, షణ్ముగం, కార్తి, వేణు, హరోన్, చని, వేను, శరవణ, శేఖర్, ధనరాజ్, హరి, కీర్తి, విజయ్ పాల్గొన్నారు.


