చిత్తూరు అర్బన్: మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉన్నప్పుడే మంచి భవిష్యత్తు, గౌరవం లభిస్తాయని చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. మాదకద్రవ్యాలకు బానిసలైన జీవితాలు నాశనం అవుతాయని పేర్కొన్నారు. కొందరు యువకులు మత్తు పదార్థాలకు బానిసలుగా మారు తూ అసాంఘిక శక్తులుగా మారాలని చూస్తున్నారని తెలిపారు. అలాంటి వారిని చట్టం వదిలిపెట్టదని హెచ్చరించారు. జిల్లాలో ఎక్కడైనా మాదకద్రవ్యాల వినియోగం జరుగుతున్నట్టు తెలిస్తే ప్రజలు పోలీసు వాట్సాప్ 9440900005, డయల్ 1972 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.
ప్రజల భాగస్వామ్యంతోనే డెంగీ నివారణ
పూతలపట్టు(యాదమరి): ప్రజల ఆరోగ్యానికి దోమలే ప్రధాన శత్రువులని, సమాజ భాగస్వామ్యంతోనే డెంగీ వ్యాధిని అరికట్టవచ్చని జిల్లా వైద్యాధికారి డాక్టర్ నాగశశిభూషన్‌రెడ్డి తెలిపా రు. ఆయన శనివారం జాతీయ డెంగీ నివారణ దినోత్సవం సందర్భంగా పూతలపట్టు పీహెచ్‌సీలో డాక్టర్ ప్రియాంక ఆధ్వర్యంలో వైద్య సిబ్బందితో కలిసి భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క రూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నా రు. నీరు నిల్వ ఉండకుండా చూడాలని పేర్కొన్నారు. నిల్వ ఉన్న నీటిలోనే దోమలు పెరుగుతాయని తెలిపారు. నీటి పాత్రలపై మూతలు పెట్టాలన్నారు. దోమల నివారణకు ప్రతి శుక్రవారం తప్పనిసరిగా డ్రై డే పాటించాలని, దోమ తెరలు వాడుతూ దోమకాటు నుంచి రక్ష ణ పొందాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మలేరియా అధికారి డాక్టర్ నవీన్, సీహెచ్ ఓ లక్ష్మినారాయణ, సిబ్బంది నరసింహప్రసా ద్, ధర్మేంద్ర, నారాయణ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
నీటి నిల్వలపెంపునకు చర్యలు
చిత్తూరు కలెక్టరేట్: జిల్లాలోని చెరువుల్లో నీటి నిల్వల పెంపునకు చర్యలు చేప ట్టామని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ శనివారం జిల్లా అధికారులతో జలధార–జలహారతి కా ర్యక్రమంపై వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించా రు. ఇందులో భాగంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి నిధులతో ఫీడర్ కాలువల్లో పూడికతీత, చెరువులను దగ్గరలోని వాగులతో అనుసంధానం, తూములకు మరమ్మతు పనులు చేపడుతున్నట్టు తెలిపారు. ఇప్పటికే 1,500 పనుల్ని గుర్తించామని, కొన్ని పనులకు పరిపాలనా అనుమతుల ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ప్రతి మూడు చెరువుల పనుల పర్యవేక్షణకు ఒక సాంకేతిక సహాయకుడిని నియమించామ ని పేర్కొన్నారు. డ్వామా పీడీ రవికుమార్, జలవనరుల శాఖ ఎస్‌ఈ వెంకటేశ్వరరాజు తదితరులు పాల్గొన్నారు.
విచారణకు హాజరైన
పూడి శ్రీహరి
కుప్పం : వైఎస్సార్ సీపీ మీడియా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి శనివారం విచారణ నిమిత్తం కుప్పం పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. సోషల్ మీడియా పోస్టులపై కుప్పంలో నమోదు చేసిన కేసులో కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణకు సహకరించాలన్న కోర్టు ఆదేశాల మేరకు శ్రీహరి శనివారం పోలీస్ స్టేషన్‌కు హాజరయ్యారు. కుప్పం డీఎస్పీ పార్థసారథి, రూరల్ సీఐ మల్లెష్ యాదవ్ గంట పాటు శ్రీహరిని విచారించారు.
ఏఈ పోస్టుల భర్తీకి
గ్రీన్ సిగ్నల్
చిత్తూరు కార్పొరేషన్ : రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్‌శాఖలో ఖాళీగా ఉన్న 629 ఏఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలో నోటిఫికేషన్ జారీ చేయాలని సూచించింది. ఎస్పీడీసీఎల్ పరిధిలో 134 ఏఈలు భర్తీ కానున్నారు. చిత్తూరు జిల్లాలో ఐరాల, ఆవులకొండ, పెను మూరు, వి.కోట, కుప్పం సెక్షన్ల ఏఈ స్థానా లు ఖాళీగా ఉండడంతో సబ్ ఇంజినీర్లకు అదనపు బాధ్యతలు అప్పగించారు. వి.కోట, కుప్పంలో మరో సెక్షన్ ఏఈకి అదనపు బాధ్యతలు ఇచ్చారు.


