సమగ్ర శిక్ష ఏపీసీగా వెంకటరమణ | - | Sakshi
Sakshi News home page

సమగ్ర శిక్ష ఏపీసీగా వెంకటరమణ

May 14 2026 6:51 AM | Updated on May 14 2026 6:51 AM

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయ అడిషనల్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గా మద్దిపట్ల వెంకటరమణ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కోన శశిధర్‌ ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం చిత్తూరులోని డివిజనల్‌ కో–ఆపరేటివ్‌ ఆఫీసర్‌ కార్యాలయంలో డిప్యూటీ రిజిస్ట్రార్‌గా విధుల్లో ఉన్న వెంకటరమణను జిల్లా అదనపు ప్రాజెక్ట్‌ కో–ఆర్డినేటర్‌గా నియమించారు. కాగా ఆయన ఇప్పటికే సమగ్ర శిక్ష ఏపీసీగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుత ఉత్తర్వుల ప్రకారం సమగ్ర శిక్ష ఏపీసీగా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏపీసీ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ బడుల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement