చిత్తూరు కలెక్టరేట్ : నిశ్శబ్ద శత్రువు రక్తపోటుపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ తెలిపారు. ఆయన శనివారం కలెక్టరేట్‌లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో కలిసి ప్రపంచ రక్తపోటు దినోత్సవం పోస్టర్లను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఆధునిక జీవనశైలి, ఒత్తిడి కారణంగా రక్తపోటు వస్తోందన్నారు. 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా రక్తపోటు పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. తద్వారా గుండె జబ్బులు, పక్షవాతం వంటి ప్రమాదాలను అరికట్టవచ్చన్నారు. ఆహారంలో ఉప్పు శాతాన్ని తగ్గించుకోవాలని, పండ్లు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు నడక, వ్యాయామం, యోగా చేయడం ద్వారా రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్‌సీలు, విలేజ్ హెల్త్ క్లినిక్‌లలో ఉచితంగా రక్తపోటు పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.


