‘కూటములను మట్టికరిపించిన విజయ్‌’ | - | Sakshi
Sakshi News home page

‘కూటములను మట్టికరిపించిన విజయ్‌’

May 10 2026 7:52 AM | Updated on May 10 2026 7:52 AM

● రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న తమిళనాడు గవర్నర్‌ ● మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి

కార్వేటినగరం: తమిళనాడు రాజకీయాల్లో 50 ఏళ్ల అనుభవం ఉన్న అన్నాడీఎంకే, డీఎంకే కూటములను మట్టి కరిపించిన ఘనత టీవీకే పార్టీ అధినేత విజయ్‌కే దక్కిందని మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి తెలిపారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ ఓటుకు నోటు చెల్లించకుండా ప్రజల మన్ననలతో విజయ్‌ 108 సీట్లు కైవసం చేసుకున్నారని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటుకు ఆయనకు అనుమతి ఇవ్వకుండా గవర్నర్‌ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నాడని దుయ్యబట్టారు. అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని కాలరాస్తూ మోదీ రాజ్యాంగాన్ని అమలు చేయా లని చూడడం దారుణమన్నారు. బేజేపీకి అనుకూలంగా ఉన్న రాష్ట్రాల్లో కొన్ని సీట్లు తక్కువ ఉన్నా వారికి సమయం ఇచ్చారని, తమళినాడులో 108 సీట్లు సాధించిన విజయ్‌ ప్రమాణ స్వీకారానికి అనుమతించక పోవడం తగదన్నారు. ఇతర పార్టీలు మద్దతు ఇచ్చేందుకు ముందుకొచ్చినా గవర్నర్‌ కుంటి సాకులతో తప్పించుకుంటున్నారని ఆరోపించారు. ఒక్క సీటు సాధించిన బీజేపీకి చెందిన వ్యక్తికి అధికారాన్ని కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్‌ఽసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫొటోతో ప్రచారం చేసి, ఆయన అమలుచేసిన సంక్షేమ పథకాలను తమిళనాడులోనూ చేస్తానని విజయ్‌ హామీ ఇచ్చారని తెలిపారు. దీంతో ప్రజలు విజయ్‌కి బ్రహ్మరథం పట్టారని వివరించారు.

చంద్రబాబుకు ఊడిగం చేస్తున్న పవన్‌

పవన్‌ కళ్యాణ్‌ తన పార్టీ అంజెడాను పక్కన పెట్టి 15 ఏళ్లుగా చంద్రబాబుకు ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. సినీరంగం నుంచి వచ్చిన విజయ్‌ కి, పవన్‌ కళ్యాణ్‌కు పోలీకే లేదని ఎద్దేవా చేశారు. రాజకీయ సభ్యత, సంస్కారం కలిగిన వ్యక్తి విజ య్‌ అని తెలిపారు. చెప్పు చూపించడం, కొడుకులని సంబోందించడం, కులాలను చూపించి ఓట్లు అడగడం పవన్‌కళ్యాణ్‌ నైజమన్నారు. ఆయ నకు విజయ్‌తో పోలికేంటని చురకలు అంటించారు. టీవీకే చీఫ్‌ విజయ్‌, వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సింగిల్‌గా ఎన్నికల్లో పోటీ చేశారని గుర్తు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement