ఊసేలేని వేరుశనగ విత్తనాల పంపిణీ రేట్లు ఖరారు కాలేదని సాకులు విత్తనం కోసం రైతుల ఎదురుచూపు అడపాదడపా కురుస్తున్న వర్షాలు విత్తనాల పంపిణీ ఆలస్యమైతే సాగు విస్తీర్ణంపై ప్రభావం
జిల్లాలో రెండేళ్లగా రైతుల పరిస్థితి అధ్వానంగా మారింది. ప్రభుత్వం నుంచి సాయం లేదు.. వేరుశనగ విత్తనాల పంపిణీ కూడా లేదు. అడపాదడపా కురుస్తున్న వర్షాలకు దుక్కిదున్ని పొలాల ను సిద్ధం చేసుకున్న రైతులు విత్తనాల కోసం ఎదురు చూస్తున్నారు. ధర నిర్ణయం కాకపోవడంతోనే విత్తనాలు పంపిణీ చేయలేదని అధికారులు సాకు లు చెబుతున్నారు. పంపిణీ ఆలస్యమైతే సాగు విస్తీర్ణంపై ప్రభావం చూపుతుందని, పంట దిగుబడి తగ్గుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
కాణిపాకం: జిల్లాలో ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 70 వేల హెక్టార్లు. అందులో వేరుశనగ సాగు విస్తీర్ణం 33 వేల హెక్టార్లు. సుమారు 80 వేల మంది రైతులు ఈ పంటను సాగుచేస్తారు. గతేడాది ఖరీఫ్‌లో వేరుశనగ విత్తనాలను సకాలంలో పంపిణీ చేయలేదు. పెట్టుబడి సాయం కూడా అందలేదు. దీంతో 7 వేల హెక్టార్లల్లో మాత్రమే సాగు చేపట్టారు.
ధర నిర్ణయించలేదని సాకులు
విత్తనాల కేటాయింపు జరిగి నెల రోజులు కావస్తున్నా ధర నిర్ణయంలో జాప్యం చోటు చేసుకుంటోంది. దీని కారణంగా ఈ ఖరీఫ్‌కు కూడా విత్తనాల పంపిణీ ఆలస్యం కానుంది. అలాగే ఇతర కారణాల వల్ల విత్తనాలను జూన్ మొదటి వారంలో పంపిణీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెలలో పంపిణీ చేస్తే రైతులు కాయలు వలుచుకుని విత్తనాలు వేసేందుకు అవకాశం ఉంటుంది.
ముందస్తు ప్రణాళికలేవీ..?
ఈ సారి కూడా అధికారులు ఖరీఫ్ సాగుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయలేదు. ఈ ఏడాది వర్షాలు లేవని.. వేరుశనగ విత్తన పంపిణీ ఉండకపోవచ్చునని జిల్లా వ్యవసాయశాఖ అధికారులు రెండు నెలల ముందే వెల్లడించారు. దీనిపై సాక్షిలో కథనం ప్రచురితం కావడంతో ప్రభుత్వం స్పందించింది. జిల్లాకు 27 వేల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు కేటాయించింది. జిల్లాకు 38 క్వింటాళ్లకు పైగా విత్తనాలు అవసరమని రైతులు అంటున్నారు. అప్పుడే రైతుకు ఒక్కో బ్యాగు చొప్పున కాయలు అందుతాయని చెబుతున్నారు. లేనిపక్షంలో కాయ ల కోసం కుస్తీ పడాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
ఖరీఫ్ సీజన్ ప్రారంభం


