అప్పుడే కూటమి నేతల ఆర్డర్లు | - | Sakshi
Sakshi News home page

అప్పుడే కూటమి నేతల ఆర్డర్లు

May 10 2026 7:52 AM | Updated on May 10 2026 7:52 AM

ప్రభుత్వం ఈ సారి జిల్లాకు 27 క్వింటాళ్ల విత్తనాలను కేటాయించింది. దీంతో రైతులకు ఒక్కో బ్యాగు కూడా అందని పరిస్థితి ఉంది. గతేడాది మాదిరిగానే ఈ సారి కూడా కూటమి నేతలు కాయల కోసం కాపు కాస్తున్నారు. ముందుగానే వ్యవసాయశాఖ అధికారులకు ఆర్డర్లు పెడుతున్నారు. దీంతో రైతులకు కాయలు అందే పరిస్థితి కనిపించడంలేదు. ఫలితంగా సాగు విస్తీర్ణం ఘణనీయంగా పడిపోయే అవకాశం ఉంది. గతేడాది కూటమి నేతలు ఇష్టానుసారంగా కాయలు పట్టుకెళ్లారు. వాటికి పలు మండలాల్లో డబ్బులు కూడా చెల్లించలేదు. బకాయిలు పేరుకుపోవడంతో కొన్నిచోట్ల వ్యవసాయశాఖ సిబ్బంది అప్పులు చేసి కొంతమేర చెల్లించారు. మరికొన్నిచోట్ల సిబ్బంది సొంత అవసరాలకు వాడేశారు. ఈ సారైనా కూటమి నేతల జోక్యం లేకుండా కాయలు పంపిణీ చేయాలని రైతులు కోరుతున్నారు. అలాగే 2024లో పంటలు దెబ్బతిన్న రైతులకు నష్టపరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. లేకుంటే ఖరీఫ్‌ సాగు విస్తీర్ణం 2 వేల హెక్టార్లకే పరిమితమవుతుందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

వేరుశనగ విత్తనాలు(ఫైల్‌)

Advertisement
 
Advertisement
Advertisement