చిత్తూరు అర్బన్: అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చోరీలకు చెక్ పెడుతున్నట్టు జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. ఆయన శనివా రం విలేకరులతో మాట్లాడు తూ రాష్ట్ర ప్రభుత్వం రి యల్ టైం గవర్నెన్స్‌లో భాగంగా ప్రవేశపెట్టిన సీసీటీవీ 360 ఏపీ వ్యవస్థ చోరీల నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. చోరీకి గురైన వాహనాలను సీసీటీవీ 360 ఏపీ ద్వారా వేగంగా గుర్తించే అవకాశం కలిగిందన్నారు. మహిళలు, చిన్నారులు, వృద్ధుల మిస్సింగ్ కేసుల్లోనూ సీసీ టీవీ సేవలు ఉపయోగకరంగా మారాయని చెప్పారు. వాహనం చోరీకి గురైన వెంటనే బాధితులు పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. లేదా జిల్లా పోలీసుల వాట్సాప్ నంబర్ 9440900005కు వాహనం రిజిస్ట్రేషన్ నంబర్, చివరిసారిగా ఎక్కడ కనిపించిందో తెలపాలన్నా రు. ప్రజలు వాహన భద్రతపై అప్రమత్తంగా ఉండాలని, స్టీరింగ్ లాక్, వీల్ లాక్ వంటి భద్రతా పరికరాలు వినియోగించాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా నంబర్ ప్లేట్ లేని వాహనాలు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.


