కొత్త గృహాల ఊసేలేదు | - | Sakshi
Sakshi News home page

కొత్త గృహాల ఊసేలేదు

May 7 2026 7:56 AM | Updated on May 7 2026 7:56 AM

గత ప్రభుత్వంకంటే ఇంకా భారీగా ఇంటి నిర్మాణాలు చేపడతామని కూటమి ప్రభుత్వం ఎన్నికలప్పుడు ఊదరగొట్టింది. కానీ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తున్నా ఇంతవరకు ఓ ఇంటి పునాదికూడా పడలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో పంచాయతీలవారీగా కూటమి నేతల ద్వారా పక్కా ఇళ్లకు అర్జీలను తీసుకున్నారు. ఆ మేరకు వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులకు కాకుండా కేవలం కూటమి కార్యకర్తలకే ఇళ్లు మంజూరు చేయించేలా హౌసింగ్‌ అధికారులకు వాటిని పంపారు. వీరి లెక్కమేరకు జిల్లాలో సుమారు 30 వేల మంది లభ్ధిదారులుగా చేర్చారు. కానీ ఇప్పటిదాకా ఒక్కరికంటే ఒక్కరికి కూడా ఇళ్లు మంజూరు కాకపోవడం కొసమెరుపు.

Advertisement
 
Advertisement
Advertisement