చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని మురుగానపల్లి వద్ద అనుమతులు లేని నారాయణ పాఠశాలను సీజ్ చేయాలని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీ ణ్ డిమాండ్ చేశారు. ఆ సంఘ నాయకులు సోమ వారం డీవైఈవో కార్యాలయంలో సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని మురుగానపల్లిలో ఎటువంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తు న్న నారాయణ పాఠశాలను వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. గత ఏడాదిగా అనుమతులు లేకుండా నారాయణ పాఠశాల నడుస్తున్నా విద్యాశాఖ అధి కారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
వసతులు లేవు.. ఫీజులు మాత్రం వేలల్లో!
జిల్లా కేంద్రంలో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయన్నారు. కనీసం ప్లే గ్రౌండ్, సరైన క్లాస్ రూమ్స్ ఇతర మౌలిక వసతులు లేకపోయినా అనుమతులు ఎలా ఇస్తున్నారని విద్యాశాఖ అధికారులను ఏఐఎస్‌ఎఫ్ నాయకులు నిలదీశారు. విద్యార్థులను మోసం చేస్తూ వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తూ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. మురుగానపల్లి నారాయణ పాఠశాలతో పాటు, నగరంలో అనుమతులు లేని అన్ని కార్పొరేట్ పాఠశాలలను వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ నాయకులు మనోజ్, లిఖిత్, లోహిత్ పాల్గొన్నారు.


