పలమనేరు పట్టణంలోని మల్లిచెట్ల దేవేంద్ర ఇంటి పెరట్లో నాటిన మే పుష్పం గురువారం వికసించింది. ఏడాదికోసారి మేలో మాత్రమే ఇది వికసిస్తుందని దేవేంద్ర తెలిపారు. సాధరణంగా కొన్ని పుష్పాలు మాత్రమే వికసిస్తుంటాయి. కానీ ఈ మొక్కకు భారీ స్థాయిలో పుష్పాలు వచ్చాయి. వీటిని చూసేందుకు చుట్టుపక్కల వారు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చాలామంది తమ సెల్‌ఫోన్లలో బంధించారు. కాగా మే ఫ్లవర్ దుంగలు కావాల్సిన వారికి ఉచితంగానే అందజేస్తామని పలమనేరు ప్రకృతి నిర్వాహకులు మల్లిచెట్ల దేవేంద్ర తెలిపారు.
– పలమనేరు


