15నుంచి ఎస్వీయూ కళాశాలలకు సెలవులు | - | Sakshi
Sakshi News home page

15నుంచి ఎస్వీయూ కళాశాలలకు సెలవులు

May 13 2026 12:20 AM | Updated on May 13 2026 12:20 AM

తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలోని అన్ని పీజీ కళాశాలలకు ఈనెల 15 నుంచి జూన్‌ 28వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించారు. వర్సిటీ పరిధిలో పీజీ, పీహెచ్‌డీ కోర్సుల చదువుతున్న విద్యార్థులకు జూన్‌ 29వ తేదీన యథాతధంగా తరగతులు ప్రారంభమవుతాయని వర్సిటీ అధికారులు తెలిపారు.

ప్రశాంతంగా ఈఏపీసెట్‌

తిరుపతి సిటీ: ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ ఈఏపీసెట్‌–2026 (ఎంసెట్‌) జిల్లాలో మంగళవారం ప్రశాంతంగా జరిగింది. తిరుపతి రేణిగుంట రోడ్డులోని చదలవాడ ఇంజినీరింగ్‌ కళాశాల, కరకంబాడి రోడ్డులోని శ్రీరామ ఇంజినీరింగ్‌ కళాశాల, అన్నమయ్య కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, జూపార్క్‌ సమీపంలోని అయాన్‌ డిజిటల్‌ సెంటర్‌, పుత్తూరు శ్రీవెంకటేశ పెరుమాల్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీలోని 5 పరీక్ష కేంద్రాల్లో ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌కు జరిగిన తొలిరోజు పరీక్షకు 96.50 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని అధికారులు తెలిపారు. ఉదయం 9 నుంచి 12గంటల వరకు నిర్వహించిన తొలి సెషన్‌లో 616 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా 592 మంది పరీక్ష రాశారన్నారు. అలాగే మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరిగిన రెండో సెషన్‌ పరీక్షకు 1,331 మందికి గాను 1,287 మంది అభ్యర్థులు హాజరైనట్లు తెలిపారు. రెండో రోజు బుధవారం జిల్లాలో ఏర్పాటు చేసిన 5 పరీక్ష కేంద్రాల్లో మరో 1,450 మంది వరకు పరీక్షకు హాజరవుతారని వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement