విద్యార్థుల జీవితాలతో ఆటలా? | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల జీవితాలతో ఆటలా?

May 13 2026 12:20 AM | Updated on May 13 2026 12:20 AM

● ఎన్‌టీఏను తక్షణం రద్దు చేయాలి ● ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి డిమాండ్‌

కేంద్ర మంత్రి

రాజీనామా చేయాలి

చిత్తూరు కలెక్టరేట్‌ : నీట్‌ నిర్వహణలో విఫలమైన కేంద్ర మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తూ నీట్‌ పరీక్షా పత్రాలను లీక్‌ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర విద్యాశాఖ మంత్రి నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు. మే 4న జరిగిన నీట్‌ ప్రవేశ పరీక్షకు దేశ వ్యాప్తంగా 20 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు. రెండేళ్ల పాటు కష్టపడి చదివి, డాక్టర్లు కావాలన్న ఆశతో పరీక్ష రాసిన పేద, మధ్యతరగతి విద్యార్థుల ఆశలపై లీకేజీ ఉదంతం నీళ్లు చల్లిందని మండిపడ్డారు.

వ్యాపారంగా మారిన పరీక్షలు

గత ఏడాది కూడా ఇలాగే హర్యానా, బీహార్‌ రాష్ట్రా ల్లో నీట్‌ పేపర్‌ను రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు అమ్ముకున్న ఉదంతాలు చోటు ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఈ ఏడా ది కూడా అదే తరహాలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. వరుసగా రెండేళ్లపాటు పేపర్లు లీక్‌ కావడం ఈ ఏజెన్సీ అసమర్థతకు నిదర్శనమని దుయ్యబట్టారు. వరుస వైఫల్యాల నేపథ్యంలో ఎన్‌ టీఏ ఏజెన్సీని తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement